Begin typing your search above and press return to search.

పవర్ స్టార్ బర్త్ డే నాడు #PSPK29 అనౌన్స్ మెంట్...?

By:  Tupaki Desk   |   13 Aug 2020 11:30 AM IST
పవర్ స్టార్ బర్త్ డే నాడు #PSPK29 అనౌన్స్ మెంట్...?
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' పరాజయం తరువాత సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. అయితే ఇప్పట్లో ఎలక్షన్స్ లేకపోవడంతో పవన్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకొని వ‌ర‌స సి నిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో కెరీర్ లో ఎప్పుడూ లేని విధంగా ఏకకాలంలో రెండు సినిమాల షూటింగ్స్ లో పాల్గొనడంతో పాటు మరో సినిమాని లైన్లో పెట్టాడు. ముందుగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'వకీల్ సాబ్' చిత్రాన్ని పట్టాలెక్కించాడు. హిందీ 'పింక్' రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు మరియు బోణీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

దీంతో పాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ మూవీ కమిట్ అయ్యాడు పవన్. పీరియాడికల్ మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ ఏఎం రత్నం నిర్మించనున్నారు. అంతేకాకుండా తన కెరీర్లో 28వ చిత్రాన్ని హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమాకి ఓకే చెప్పాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేయబోతున్నారని అధికారికంగా ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం PSPK29 ప్రాజెక్ట్ కి కూడా పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.

కాగా, పవన్‌ కళ్యాణ్ తన కెరీర్లో 29వ చిత్రాన్ని స్టైలిష్ డైరెక్టర్ సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో చేయనున్నారని సమాచారం. ఈ సినిమాను పవన్ కళ్యాణ్ హోమ్ ప్రొడక్షన్ 'పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్' బ్యానర్ పై ఎస్సార్టీ ఎంటర్టైన్మెంట్స్ రామ్ తాళ్లూరితో కలిసి నిర్మించనున్నారట. ఇక ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టోరీ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందించగా సురేందర్ రెడ్డి డైరెక్షన్ చేస్తారని తెలుస్తోంది. సెప్టెంబర్‌ 2వ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే పవర్ స్టార్ బర్త్ డే వరకు ఆగాల్సిందే.