Begin typing your search above and press return to search.

పవర్ స్టార్ బర్త్ డే స్పెషల్ : #PSPK28 కాన్సెప్ట్ పోస్టర్...!

By:  Tupaki Desk   |   2 Sept 2020 4:20 PM IST
పవర్ స్టార్ బర్త్ డే స్పెషల్ : #PSPK28 కాన్సెప్ట్ పోస్టర్...!
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. పవన్ కెరీర్లో 28వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - రవి శంకర్ నిర్మించనున్నారు. నేడు పవన్ కళ్యాణ్ బర్త్ డేని పురష్కరించుకుని #PSPK28 సినిమాకి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేస్తూ పవన్ కి శుభాకాంక్షలు తెలియజేసింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్ ఇండియా గేట్ మరియు స్వాతంత్ర్య సమరయోధులు సర్ధార్ వల్లభాయ్ పటేల్ - సుభాష్ చంద్రబోస్ చిత్రాలు కనిపించేలా డిజైన్ చేయబడి ఉంది. ఓ బైక్ పై పెద్ద బాలశిక్ష పుస్తకంతో పాటు రోజా పువ్వు కనిపిస్తోంది. 'బ్లాక్ బస్టర్ కాంబో మళ్ళీ వస్తోంది.. ఈసారి ఇది ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు' అంటూ రిలీజ్ చేసిన ఈ కాన్సెప్ట్ పోస్టర్ ఆసక్తిని కలిగిస్తోంది.

కాగా #PSPK28 కి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. బోస్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా రామ్ - లక్ష్మణ్ లు ఫైట్స్ కంపోజ్ చేయనున్నారు. ఇంతకముందు పవన్ - హరీష్ కాంబోలో వచ్చిన ''గబ్బర్‌ సింగ్'' మూవీ బ్లాక్‌ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అప్పటి వరకు వరుస ప్లాప్స్‌ లో ఉన్న పవన్ కల్యాణ్‌ కి.. పవర్ స్టార్ ఫ్యాన్స్‌ కి ఈ చిత్రంతో నూతనోత్సాహాన్ని ఇవ్వడమే కాకుండా బాక్సాఫీస్ లెక్కలు సరిచేసారు. పవన్ కళ్యాణ్ గెటప్, లుక్స్, డైలాగ్స్‌ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన హరీష్ శంకర్ 'గబ్బర్ సింగ్' ఘన విజయం సాధించడంలో భాగం అయ్యాడు. ఇప్పుడు ఈ సక్సెస్ఫుల్ కాంబోలో మరో సినిమా వస్తుండటంతో అభిమానులు గాల్లో తేలిపోతున్నారు. 'గబ్బర్ సింగ్' రిజల్ట్ మళ్లీ రిపీట్ అవుతుంది అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.