Begin typing your search above and press return to search.

పవర్ స్టార్.. ఇది కొత్తగానే ఉంది

By:  Tupaki Desk   |   24 Nov 2015 3:39 PM IST
పవర్ స్టార్.. ఇది కొత్తగానే ఉంది
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఓ క్రేజ్ - ఓ మైకం - ఓ ఇజం. పవనిజం అంటే అదో సెపరేట్ మతం అని ఫీలయ్యేవాళ్లు కూడా ఉన్నారు. మరి ఫ్యాన్స్ ఇంతగా అభిమానిస్తుంటే.. ఆయన మాత్రం బాగా రిజర్వ్ డ్. ఓ నాలుగు ముక్కలు కలివిడిగా మాట్లాడ్డానికి కూడా మొహమాటమడ్డం ఆయన నైజం. వీలైనంత వరకూ హడావిడికి దూరంగా ఉండేందుకే ప్రయత్నిస్తాడు పవన్. కానీ ఇప్పుడు సడెన్ గా పవన్ లో సూపర్బ్ చేంజ్ వచ్చేసింది.

అంటీ ముట్టనట్టుగా వ్యవహరిచే పవన్ ఒక్క సారిగా కలిసిపోతున్నాడు. అది కూడా ఫ్యాన్స్ తో మమేకం అయిపోతున్నాడు. షూటింగ్ జరిగే ప్రాంతానికి చాలామంది ఫ్యాన్స్ వస్తుంటారు. ఇలాంటి వాళ్లకు ఓ చేయి ఊపేసి పంపించేయడం గతంలో పవన్ కి అలవాటు. ఇప్పుడు మాత్రం దగ్గరకి పిలిచి మరీ మాట్లాడుతున్నాడు. అడిగిన వాళ్లందరితో ఫోటోలు దిగుతున్నాడు. సెల్ఫీలకి కూడా సై అంటున్నాడు పవన్ కళ్యాణ్. దీంతో ఫ్యాన్స్ ఫుల్లు ఖుషీ అయిపోతున్నారు. ఎంతగా ఫ్యాన్స్ తో పవన్ కలుస్తున్నాడంటే.. రోజూ సాయంత్రం ఓ అరగంట పాటు ఫోటోసెషన్ కి కేటాయిస్తున్నాడని చెబ్తున్నారు. గతంలో ఇలాంటి అలవాటు మెగాస్టార్ చిరంజీవికి ఉండేది. ఇప్పుడు పవన్ కూడా ఆ ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నాడు.

అంతేకాదు ఇంతకుముందు దూరం దూరం అనేలా ఉంటే పవన్.. ఇప్పుడు దగ్గరకు తీసుకుని ఫోటోకి ఫోజులిమ్మన్నా సరే అనేస్తున్నాడు. ఈ దెబ్బకి పవన్ తో కలిసి ఫోటో దిగే ఛాన్స్ ఇప్పించమంటూ యూనిట్ మెంబర్ల చుట్టూ తిరిగే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇలాంటి వాటిని పక్కన పెడితే తమ అభిమాన స్టార్ లో వచ్చిన ఈ అద్భుతమైన మార్పును చూసి.. ఫ్యాన్స్ మాత్రం ఫుల్లు ఖుషీ అయిపోతున్నారు.