Begin typing your search above and press return to search.

సెప్టెంబర్ 10 నుండి.. పవన్ 50 రోజులు

By:  Tupaki Desk   |   6 Sep 2016 11:26 AM GMT
సెప్టెంబర్ 10 నుండి.. పవన్ 50 రోజులు
X
ఇప్పటివరకు కేవలం పేపర్లమీదనే మనం పవన్ కళ్యాణ్‌ అండ్ డాలీ కొత్త సినిమా గురించి ఎక్కువగా విన్నాం. ఒక ప్రక్కన ''కాటం రాయుడు'' అంటూ అఫీషియల్ గా యాడ్ వచ్చినప్పటికీ.. ఇప్పటివరకు షూటింగ్ విషయంలో ఏం జరుగుతుంది అని ఎవ్వరికీ క్లారిటీయే లేదు. అయితే ఇప్పుడు మాత్రం ఒక కొత్త షెడ్యూల్ వినిపిస్తోంది.

ఇప్పటికే పవన్‌ కళ్యాణ్‌ తను షూటింగ్ చేయకపోగా.. అవతల సెక్సిణి శృతి హాసన్ కూడా తన డేట్లను వేస్ట్ చేస్తూ అలాగే కూర్చుంది. అయితే ఇప్పుడు పవన్ షూటింగుకు రెడీ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. సెప్టెంబర్ 10 నుండి పవన్ రంగంలోకి దిగడానికి.. ఇప్పటికే దర్శకుడు డాలీ మరియు ప్రొడ్యూసర్ శరత్ మరార్ అందుకు తగిన ఏర్పాట్లను చేసేశారని తెలుస్తోంది. అసలు ఇంకో ట్విస్టేంటంటే.. ఏకంగా వరుసపెట్టి 50 రోజులుపాటు నాన్ స్టాప్ గా పవన్ ఈ సినిమా షూటింగ్ మొత్తం సింగిల్ షెడ్యూల్ లో ఫినిష్‌ చేస్తారట. డిసెంబర్ లోపు పవన్ షూటింగ్ అంతా పూర్తవుతుందని.. ఆ తరువాత ఆయన పొలిటికల్ ఎసైన్మెంట్లు కొన్ని చూసుకుంటారని టాక్.

ఏదైతేనేం.. పవన్ ఈ మధ్యన స్పీడుగా ఒక సినిమాను ఫినిష్‌ చేసి చాలా రోజులే అయ్యింది. కాబట్టి మనోడు 50 రోజుల్లో షూటింగ్ పూర్తిచేస్తాడటే.. అది గిన్నీసులకే గిన్నీస్ రికార్డు అనుకోవాలి.