Begin typing your search above and press return to search.

పవన్‌ కర్చీఫ్‌ ఎందుకు వేశాడో??

By:  Tupaki Desk   |   4 Feb 2016 11:00 PM IST
పవన్‌ కర్చీఫ్‌ ఎందుకు వేశాడో??
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ చూసి రెండేళ్లు కావస్తోంది. అత్తారింటికి దారేది చిత్రం తర్వాత పవన్ ను ఫుల్ ప్లెడ్జెడ్ హీరోగా చూసే ఛాన్స్ ఫ్యాన్స్ కి రాలేదు. గతేడాది గోపాల గోపాల రిలీజ్ అయినా.. ఇందులో ప్రధాన పాత్ర తప్పితే, హీరో కాదు. అందుకే పవన్ మూవీని చూసేందుకు ఫ్యాన్స్ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఆరేడు నెలలుగా ఆగిఆగి షూటింగ్ జరుపుకున్న సర్దార్ గబ్బర్ సింగ్.. ఇఫ్పుడు శరవేగంగానే సాగుతోంది.

ఈ సినిమాని ఏప్రిల్ 8న రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్లు ఈరోస్ ఇంటర్నేషనల్ ఈరోజే ప్రకటించేసింది. అయితే ఇంత సడన్‌ గా వీళ్ళు షూటింగ్‌ కూడా పూర్తి కాకుండా రిలీజ్‌ డేట్‌ చెప్పాశారంటే.. ఇందులో ఏదో ఉంది అని అనిపించడం ఖాయం. ఒక ప్రక్కన మహేష్‌ బాబు ''బ్రహ్మోత్సవం'' పోస్టు పోన్‌ అయ్యిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంకో ప్రక్కన.. ''సరైనోడు'' సినిమా రిలీజ్‌ కు రెడీ ఉందని అంటున్నారు. అంటే.. ఏప్రియల్‌ నెలలో సరైనోడు కాకుండా మేమే అంటూ స్లాట్‌ బుక్‌ చేసుకోవడానికే పవన్‌ ఇలా ముందుగానే ప్రకటించేశాడా? సంక్రాంతి టైపులో ఒకే డేటుపై ఎక్కువ సినిమాలు పడిపోయి ప్రెజర్‌ పడకూడదని ఈ కోయిల ముందే కూసిందా?

ఆ విధంగా పవన్‌ కళ్యాన్‌ ఏప్రియల్‌ 8పై కర్చీఫ్‌ వేసేశాడు. ఏదేమైనా కూడా.. ఏప్రియల్‌ లో సమ్మర్‌ ట్రీట్‌ గా మరోసారి టాలీవుడ్‌ షేకవనుంది అన్నమాట. ఈ నాన్నకు ప్రేమతో 50 కోట్ల క్లబ్‌ రికార్డులు ఏమన్నా ఎవరైనా బ్రేక్‌ చేస్తారేమో చూద్దాం.