Begin typing your search above and press return to search.
సర్ధార్ జీ షూటింగ్ కంటిన్యూ చేస్తారా?
By: Tupaki Desk | 8 Oct 2015 11:00 PM ISTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా బాబి దర్శకత్వంలో సర్ధార్ గబ్బర్ సింగ్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే రాయ్ లక్ష్మీ పై ఐటెమ్ నంబర్ ని షూట్ చేశారు. ఈ పాట చిత్రీకరణ కోసం మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ ఆన్ లొకేషన్ హల్ చల్ చేశాడు. దర్శకుడు బాబి - పవన్ సహా ప్రముఖులంతా ఆన్ సెట్స్ ఉన్నారు. మొత్తానికి రెడ్ హాట్ లేడీ లక్కీరాయ్ షూటింగ్ పూర్తి చేసుకుని తదుపరి షూటింగ్ కోసం ముంబయ్ వెళ్లిపోయింది. మరి ఇప్పుడు అత్యంత కీలకమైన టాకీ పార్ట్ చిత్రీకరణ సాగుతుందా? అన్నదే డిష్కసన్ పాయింట్.
అప్పట్లో పవన్ - బాబిల మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని ప్రచారమైంది. బాబి రాసుకొచ్చిన సీన్లు - డైలాగులు పవన్ కి నచ్చలేదు. దాంతో కొత్త వెర్షన్ రాయాల్సిందిగా ఓ కొత్త రైటర్ ని పిలిపించుకున్నారు. సదరు రచయితల్ని తనతోనే ఉండాల్సిందిగా ఆజ్ఞాపించాడు. మరి ఇప్పటికి బాబికి ఇద్దరికి మధ్య మనస్ఫర్థలు తొలగిపోయి సఖ్యంగానే ఉంటున్నారా? సర్ధార్జీ పవన్ సెట్స్ కెళ్లడానికి సిద్ధంగా ఉన్నారా? అలిగి సెట్స్ నుంచి వెళ్లిపోయారు కాబట్టి మరి సెట్ రైట్ అయినట్టేనా? ఇన్ని సందేహాలు అభిమానుల బుర్ర తొలిచేస్తున్నాయి. దీనికి పవన్ స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.
ఇవన్నీ కరెక్టుగా జరిగేతే.. సర్దార్ సినిమా జనవరి 2016లో సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయ్యే ఛాన్సుంటుంది. లేకపోతే సంక్రాంతికి దాదాపు మిస్ అయిపోయినట్లే. మరి చూద్దాం పవన్ తన అభిమానులను ఎంతవరకు శాటిస్ఫై చేస్తాడో..