Begin typing your search above and press return to search.

గబ్బర్ సింగ్ మార్పులే కాటమరాయుడిలో కూడా..

By:  Tupaki Desk   |   16 Sep 2016 10:30 PM GMT
గబ్బర్ సింగ్ మార్పులే కాటమరాయుడిలో కూడా..
X
దబాంగ్ సినిమా హక్కులను కొన్ని కోట్లకు కొనుక్కుని అందులో భారీ మార్పులు చేసి క్రేజ్ కి తగ్గట్టుగా గబ్బర్ సింగ్ సినిమాను మార్చిన తీరు అందరినీ మెప్పించింది. అది కాస్త బోల్డ్ స్టెప్ అయినా ఆ రిస్కే చెయ్యకపోతే హరీష్ శంకర్ చరిత్రలో నిలిచేవాడుకాదేమో. ఇప్పుడు అలాంటి మార్పే పవన్ మరో చిత్రానికి జరగనున్నట్టు సమాచారం.

పవన్ కళ్యాణ్ హీరోగా నటించనున్న కాటమరాయుడు సినిమాని మొదట్లో తమిళ దర్శకుడు సూర్య తెరకెక్కించాల్సివుంది. అయితే అనుకోని కారాణాల వలన సూర్య ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. ఈ స్క్రిప్ట్ ని తమిళనాట అజిత్ నటించి విజయం సాధించిన వీరమ్ చిత్రాన్ని బేస్ గా తీసుకుని రాశారు. అయితే సూర్య తరువాత డాలీ ఎంటర్ అయినా స్క్రిప్ట్ లో మార్పులేం చెయ్యలేదు.

కాకపోతే పవన్ రాజకీయ అంశాలమధ్య బిజీగా వుండడంతో డాలీకి కావలిసినంత సమయం దొరికి స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేసినట్టు సమాచారం. పవన్ అభిమానులు ఆశించే ఎంటర్టైన్మెంట్ - పంచ్ లు పుష్కలంగా జోడించారట. ఈ సినిమాలో వయసు పైబడిన కారణంగా పెళ్ళికి దూరంగా వుండే ఫ్యాక్షన్ లీడర్ పాత్రలో పవన్ కనిపించనున్నాడు.