Begin typing your search above and press return to search.

కాటమరాయుడు.. కొత్త డేట్

By:  Tupaki Desk   |   14 Sept 2016 5:00 PM IST
కాటమరాయుడు.. కొత్త డేట్
X
ఇప్పటికే మూడున్నర నెలలవుతోంది పవన్ కళ్యాణ్ తన కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టి. కానీ షూటింగ్ విషయంలో మాత్రం ఒక్క అడుగూ ముందుకు పడలేదు. ఇదిగో అదిగో అంటున్నారు కానీ.. రెగ్యులర్ షూటింగ్ మాత్రం మొదలు కాలేదు. ఆ మధ్య రెండు రోజులు ఏదో లాంఛనంగా షూటింగ్ చేశారన్నారు కానీ.. అందులో కూడా ఎంత వాస్తవమో తెలియదు. ఇంతలో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా అతడి పాత లుక్ ఒకదానికి కొంచెం హంగులద్ది ‘కాటమరాయుడు’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. పవన్ ఉన్నట్లుండి ప్రత్యేక హోదా అంశాన్ని నెత్తికెత్తుకుని పోరాటం మొదలుపెట్టడంతో అసలు ఈ సినిమా ఏమవుతుందో అని అంతా సందేహించారు.

ఇలాంటి టైంలో ‘కాటమరాయుడు’కు సంబంధించి ఓ లేటేస్ట్ అప్ డేట్ ఒకటి బయటికి వచ్చింది. ఈ నెల 24 నుంచి ‘కాటమరాయుడు’ రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందట. పవన్ కళ్యాణ్ - శ్రుతిహాసన్‌ లతో పాటు కీలక పాత్రధారులందరూ ఈ షెడ్యూల్లో షూటింగుకి హాజరవుతారట. మధ్యమధ్యలో కొన్ని పొలిటికల్ కమిట్మెంట్ల కోసం కొన్ని డేట్లను మినహాయిస్తే పవన్ రెగ్యులర్‌ గా షూటింగులో పాల్గొంటాడని సమాచారం. ఈ ఏడాది చివరికల్లా టాకీ పార్ట్ పూర్తి చేయాలని టార్గెట్‌ గా పెట్టుకున్నారు. దీని తర్వాత త్రివిక్రమ్ సినిమాను కూడా వెంటనే మొదలుపెట్టాలని పవన్ భావిస్తున్నాడు. డాలీ దర్శకత్వం వహిస్తున్న ‘కాటమరాయుడు’ను పవన్ మిత్రుడు శరత్ మరారే నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.