Begin typing your search above and press return to search.

ఇంతకీ పవన్ చూశాడా లేదా?

By:  Tupaki Desk   |   18 July 2015 1:12 PM IST
ఇంతకీ పవన్ చూశాడా లేదా?
X
మన సినిమాను చూసి వేరే భాషల జనాలు అసూయ చెందే సందర్భం వచ్చి ఎన్నేళ్లయిందో. గత రెండు దశాబ్దాల్లో అయితే అలాంటి సినిమా ఏదీ రాలేదు. కానీ బాహుబలి సాగిస్తున్న ప్రభంజనం చూసి బాలీవుడ్ జనాలకు కంటి మీద కునుకు లేదు. ఇలాంటి సినిమా తీసే దమ్ము బాలీవుడ్ డైరెక్టర్లెవరికైనా ఉందా అని శేఖర్ కపూర్ లాంటి ప్రసిద్ధ డైరెక్టర్ సవాలు విసిరాడంటే అక్కడి జనాలకు ‘బాహుబలి’ ఎంతగా మంట పుట్టిస్తూ ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి కామెంట్లు చూసి టాలీవుడ్ జనాలందరూ చాలా గర్వపడుతూ ఉంటారు. ఇక బాహుబలి సాధిస్తున్న కలెక్షన్ల సునామీ చూసి మనోళ్లంతా కాలర్ ఎగరేస్తున్నారు.

మహేష్ బాబు లాంటి వాడు సైతం ఏ భేషజం లేకుండా బాహుబలి టాలీవుడ్ హీరోగా తనకు గర్వకారణమని చెప్పాడు. అగ్ర హీరోలందరూ కూడా సినిమా విడుదలకు ముందో వెనకో బాహుబలి గురించి మాట్లాడిన వాళ్లే. ఏడేళ్లకు పైగా సినిమాలకు దూరంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి సైతం ‘బాహుబలి’ని ప్రశంసించారు. ఐతే ఇప్పటిదాకా టాలీవుడ్‌లో బాహుబలి ప్రస్తావన తేని ఏకైక కథానాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రమే. మామూలుగా పవన్ తన సినిమాల గురించే మాట్లాడడు. ఇక వేరే వాళ్ల సినిమాల ప్రస్తావన చేస్తాడని ఆశించడం అత్యాశే. ఐతే బాహుబలి ప్రత్యేకమైన సినిమా కాబట్టి స్పందిస్తాడేమో అని చూస్తున్నారు జనాలు. ఐతే పవన్ మొదట్నుంచి రాజకీయ ట్వీట్ల కోసం మాత్రమే ట్విట్టర్‌ను ఉపయోగిస్తున్నాడు. ప్రస్తుతానికి మనోడు బయటెక్కడా కనిపించే అవకాశం లేవు. ఐతే రాజమౌళికో, శోభు యార్లగడ్డకో ఫోన్ చేసి అభినందిస్తే అభినందించొచ్చు. అలాంటిదేమైనా జరిగితే ఆ సమాచారం బయటికి రాకపోదు.అభినందనల సంగతి సరే కానీ.. ఇంతకీ పవన్ బాహుబలి చూశాడో లేదో మరి.