Begin typing your search above and press return to search.

హేయ్!! పవన్ వచ్చేశాడహో!!

By:  Tupaki Desk   |   26 Sept 2016 3:35 PM IST
హేయ్!! పవన్ వచ్చేశాడహో!!
X
ఎప్పుడు తన సినిమాలను మొదలెడతాడు.. ఎప్పడు షూటింగులో పాల్గొంటాడు.. ఎప్పుడు రిలీజ్ చేస్తాడు.. ఇలాంటి విషయాలపై పెద్దగా క్లారిటీ లేకుండా పనిచేయడం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ కు అలవాటే. అయితే మనోడు ఇప్పుడు మాత్రం చెప్పిన డేట్లకే పనిచేయడం ఒక అలవాటుగా మార్చేసుకున్నాడు. సెప్టెంబర్ 26 అంటూ గతంలోనే క్లారిటీ ఇచ్చిన ఈ స్టార్ హీరో.. ఇప్పుడు అదే నిజం చేశాడు.

ఈరోజు ఉదయం నుండి.. వైట్ లుంగీ వైట్ షర్టులో.. కొత్త లుక్కులో షూటింగ్ చేయడం మొదలెట్టేశాడు పవన్. దర్శకుడు డాలీ డైరక్షన్లో శరత్ మరార్ ప్రొడక్షన్లో.. తమిళంలో అజిత్ హీరోగా వచ్చిన 'వీరమ్' సినిమాను తెలుగులో ఇలా రీమేక్ చేస్తున్నారనేది టాక్. అయితే ఈ రీమేక్ విషయాన్ని అఫీషియల్ గా కన్ఫామ్ చేయకపోయినా కూడా.. పవన్ లుక్ చూస్తే మాత్రం అచ్చం ఆ సినిమాలో అజిత్ ఉన్నట్లే ఉంది. అలాగే సినిమాలో హీరోయిన్.. ఒక మరదలు.. నలుగురు తమ్ముళ్ళు.. ఇలా ఆ సినిమాలో ఉన్న క్యారక్టర్లన్నీ తెలుగులో కూడా ఉన్నాయి.

ఇకపోతే ఈ సినిమాలో శృతి హాసన్ లీడ్ హీరోయిన్ అవగా.. మరో ఇద్దరు చిన్న హీరోయిన్లు కూడా నటిస్తున్నారు. అలాగే పెళ్ళిచూపులు ఫేం విజయ్.. మరో హీరో కమల్ కామరాజు.. పవన్ తమ్ముళ్లుగా నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.