Begin typing your search above and press return to search.

#వ‌కీల్ సాబ్.. గుబురు గ‌డ్డం మాసిన జుట్టుకి బైబై

By:  Tupaki Desk   |   17 Dec 2020 1:43 PM IST
#వ‌కీల్ సాబ్.. గుబురు గ‌డ్డం మాసిన జుట్టుకి బైబై
X
బాగా పెరిగిన గడ్డం మాసిన జుట్టుతో చాలాకాలంగా రూపు మారిపోయి క‌నిపించిన ప‌వ‌ర్ స్టార్ ఇప్పుడు లుక్ మార్చి అభిమానుల‌ను స‌ర్ ప్రైజ్ చేశారు. అపరిశుభ్రమైన జుట్టు కనిపించ‌డం లేదు.. గుబురు గ‌డ్డం లేనే లేదు. ఫుల్ ట్రిమ్ గా ఇస్మార్ట్ లుక్ లోకి మారిపోయి ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తున్నారు. ఇదంతా దేనికోసం అంటే.. వకీల్ సాబ్ ప్రస్తుత హైదరాబాద్ షెడ్యూల్ కోస‌మేన‌ట‌.

గడ్డంలేకుండా స్టైలిష్ గా హెయిర్ స్టైల్ తో ఇస్మార్ట్ లుక్ లో క‌నిపించ‌డంతో అభిమానులు ఖుషీ అయిపోతున్నారు. ఇటీవ‌ల‌ నిహారికా వివాహానికి హాజరైనప్పుడు పవన్ కళ్యాణ్ లుక్ మార్చారు. వైట్ అండ్ వైట్ కుర్తా లో ప‌వ‌న్ లుక్ అతని అభిమానులకు ఎంతో రిలీఫ్ నిచ్చింది.

నిజానికి రాజ‌కీయాల్లో బిజీగా ఉండ‌డం వ‌ల్ల ఆయ‌న రోజుల త‌ర‌బ‌డి గెట‌ప్ గురించి ప‌ట్టించుకోలేదు కానీ అవ‌స‌రాన్ని బ‌ట్టి లుక్ ఛేంజ్ చేసేయ‌గ‌ల‌రు. ఇలా ఫ్రెష్ లుక్ తో వ‌కీల్ సాబ్ ని చూడ‌డం అభిమానుల‌కు ఎంతో రీఫ్రెషింగ్ గా ఉంది మ‌రి. ఈ సినిమా త‌ర్వాత క్రిష్ తో హిస్టారిక‌ల్ మూవీ కోసం గెట‌ప్ ఛేంజ్ చేయాల్సి ఉంటే దానికి కూడా ప‌వ‌న్ సిద్ధ‌మే.