Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: మ‌ళ్లీ చాక్లెట్ బోయ్ లా మారారు

By:  Tupaki Desk   |   4 Nov 2020 11:00 AM IST
ఫోటో స్టోరి: మ‌ళ్లీ చాక్లెట్ బోయ్ లా మారారు
X
సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ త‌ర్వాత మ‌ళ్లీ అంతే సింప్లిసిటీ ఆధ్యాత్మిక‌త సౌత్ లో ఏ హీరోలో క‌నిపిస్తోంది? అంటే.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ పేరే వినిపిస్తోంది. 50కి చేరువ‌వుతున్న వేళ‌ ఆయ‌నలో మార్పు ఆధ్యాత్మిక చింత‌న స‌ర్వ‌త్రా ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. గోపాల గోపాల స‌మ‌యంలో వివేకానందుని క్లాసుల‌తో వెంకీ మ‌రింత‌గా ప‌వ‌న్ ని మార్చేశారు.

ఇక‌పోతే ఇటీవ‌లి కాలంలో ప‌వన్ ఎక్కువ స‌మ‌యాన్ని స‌హ‌జ‌సిద్ధంగా సిటీ ఔట‌ర్ ఫామ్ హౌస్ లో గ‌డిపేందుకే ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్నారు. ఒక సాధార‌ణ రైతులా ఆయ‌న మామిడి తోట‌కు నీళ్లు పెడుతూ సేద్యం చేస్తూ జీవించేస్తున్నారు. ఇక ఇటీవ‌ల ఆయ‌న ఫోటోషూట్లు చూసిన ఎవ‌రైనా షాక్ తినాల్సిందే. ఎంతో స‌హ‌జంగా ఆయ‌న ఒక సాధార‌ణ రైతులాగా క‌నిపించారు త‌ప్ప ఎక్క‌డా భేష‌జానికి పోలేదు. అయితే పండిన వెంట్రుక‌లు గుబురు గ‌డ్డంతో అస‌లు మ‌రీ మ‌హ‌ర్షిలా మారిపోతే ఎలా? అంటూ అభిమానులు క‌ల‌త‌కు గుర‌య్యారు. సోష‌ల్ మీడియాల్లో విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఓవైపు బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌కు సంత‌కాలు చేస్తూ ఏజ్ బ‌య‌ట‌పెట్టేస్తే ఎలా అన్న వాద‌నా వినిపించింది.

చివ‌రికి అన్నిటికీ ఇదిగో ఇదే నా స‌మాధానం అన్న తీరుగా మారిపోయారు ప‌వ‌న్. ఆయ‌న లేటెస్ట్ గా చాక్లెట్ బోయ్ గెట‌ప్ కి షిఫ్ట‌యిపోయారు. ఇది ఊహించ‌ని గెట‌ప్. చాలా సింపుల్ గా ఫుల్ హ్యాండ్ టీష‌ర్ట్ డెనిమ్స్ లో స్మార్ట్ గా క‌నిపించారు ప‌వ‌న్ క‌ల్యాణ్. ఈ లుక్ చూస్తుంటే ఖుషీ రోజులు గుర్తుకొస్తున్నాయి. బ‌హుశా ఖుషీ సీక్వెల్ తీసినా అది అభిమానుల‌కు ఫుల్ జోష్ నిచ్చే వ్య‌వ‌హార‌మే.

ఆదివారం నుండి వకీల్ సాబ్ షూటింగ్ ప్రారంభించిన ప‌వ‌న్ చివరికి గిర‌జాల‌ జుట్టును గడ్డంను కత్తిరించేశారు. తన స్నేహితుడు ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి పవన్ ఇలా సెట్లో క‌నిపించారు. చక్కగా కత్తిరించిన గడ్డం కొద్దిగా పొడవాటి జుట్టులో పవన్ పొడవాటి స్లీవ్ టీ షర్ట్ డెనిమ్ ధరించాడు. ఈ కొత్త లుక్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. వ‌కీల్ సాబ్ కి సంబంధించి పవన్ పై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను దర్శకుడు వేణు శ్రీరామ్ చిత్రీక‌రిస్తున్నార‌ట‌. అన్నపూర్ణ స్టూడియోస్ లో షూటింగ్ జరుగుతోంది.