Begin typing your search above and press return to search.
పవన్ - క్రిష్ పాన్ ఇండియా మూవీ టైటిల్ ఇదేనా?
By: Tupaki Desk | 14 Sept 2020 10:30 AM ISTపవర్ స్టార్ పవన్‌కల్యాణ్ - పక్కా ప్రొఫెషనల్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తొలిసారి కలిసి ఓ భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. మొగల్ సామ్రాజ్యానికి చెందిన కోహినూర్ వజ్రం తస్కరణ నేపథ్యంలో సినిమా ఇది. తెలంగాణకు చెందిన ఓ గజదొంగగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్నారు. రాబిన్ హుడ్ తరహా కథగా ఈ ప్రాజెక్ట్ ని క్రిష్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం. రత్నం ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు.
ఈ మూవీకి సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ వైరల్ గా మారింది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి `గజదొంగ`.. విరూపాక్ష వంటి పలు పేర్లన్నీ ఇటీవల వినిపించాయి. అయితే తాజాగా ఈ చిత్రానికి `ఓం శివమ్` అనే టైటిల్ వినిపిస్తోంది. ఇంతగా ఈ సినిమా టైటిల్స్‌పై ప్రచారం జరుగుతున్నామూవీ టీమ్ మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు.
రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవన్‌కల్యాణ్ నటిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ హాట్ గార్ల్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటిస్తోంది. ఆమె పాత్రే సినిమాని కీలక మలుపు తిప్పుతుందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇక మరో బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ మరో కీలక పాత్రలో కనిపించబోతున్నారు.