Begin typing your search above and press return to search.

అక్క‌డ ప‌ని చేస్తున్నా క్రిష్ మ‌న‌సంతా ఇక్క‌డే

By:  Tupaki Desk   |   12 Oct 2020 5:20 PM IST
అక్క‌డ ప‌ని చేస్తున్నా క్రిష్ మ‌న‌సంతా ఇక్క‌డే
X
మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ తో సినిమా చేస్తున్నారు డైరెక్ట‌ర్ క్రిష్‌. ప్రస్తుతం వికారాబాద్ ‌లో వైష్ణవ్ తేజ్ పై సీన్స్ తీస్తున్నారు. శ‌ర‌వేగంగా ఈ సినిమాని పూర్తి చేయాల‌న్న‌ది ప్లాన్. ఇంకా చెప్పాలంటే అక్టోబ‌ర్ ఎండ్ తో టాకీ పూర్త‌యిపోతుంది. అటుపై నిర్మాణానంత‌ర ప‌నులు చేస్తూనే.. ప‌వ‌న్ తో చేయాల్సిన సినిమాపై క్రిష్ దృష్టి సారిస్తార‌ట‌.

అక్క‌డ ప‌ని చేస్తున్నా క్రిష్ మ‌న‌సంతా ఇక్క‌డే ఉంద‌ట‌.‌ అతని బృందం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ కోసం షెడ్యూల్ ప్లాన్ చేస్తోందిట‌. ఈ చిత్రంలో హీరోయిన్లు.. ఇతర నటీనటుల గురించి చాలా ఊహాహాగానాలు వినిపించినా ఇంకా కొంద‌రిని ఫైన‌ల్ చేయాల్సి ఉంది.

ఇక క్రిష్ కి ప‌వ‌న్ ఎప్ప‌టి నుంచి అందుబాటులోకి వ‌స్తారు? అన్న‌దానికి స‌మాధానం వెతికితే.. పవర్ ‌స్టార్ అక్టోబర్ 26 నుంచి వకీల్ సాబ్ చిత్రీకరణను తిరిగి ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టును నవంబర్ నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు. సేమ్ టైమ్ అయ్యప్పనమ్ కోషియం రీమేక్ చిత్రీక‌ర‌ణ‌పైనా ప‌వ‌న్ ఆలోచిస్తున్నారు. ఇంకా దీనికి దర్శకుడు ఖరారు కాలేదు. ఇలాంటి కార‌ణాల వ‌ల్ల‌ పవన్ కళ్యాణ్ నవంబర్ నుండి తన తదుపరి షెడ్యూల్ ని ప్లాన్ చేయమని క్రిష్ ని కోరారట‌. అంతేకాదు షూటింగ్ నవంబర్ మిడిల్ నుండి తిరిగి ప్రారంభ‌మ‌య్యే ఆస్కారం ఉందిట‌.

ప‌వ‌న్ - క్రిష్ మూవీకి ఎం.ఎం.కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండ‌గా.. ఎ.ఎమ్.రత్నం నిర్మిస్తున్నారు. అత్యంత భారీ బ‌డ్జ‌ట్ తో హిస్టారిక‌ల్ నేప‌థ్యంలో రాబిన్ హుడ్ త‌ర‌హా చిత్ర‌మిది. వచ్చే ఏడాది విడుదల అవుతుంది.

పవన్ కళ్యాణ్ ఈ సంవత్సరం చివరి నాటికి కొన్ని ప్రధాన షెడ్యూళ్ల‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. వ‌రుస క‌మిట్ మెంట్ల‌ను వేగంగా పూర్తి చేయాల‌ని అత‌డు భావిస్తున్నార‌ట‌. క‌రోనా భ‌యాల్ని ప‌వ‌న్ ఇక వ‌దిలేశార‌ని ప్ర‌చార‌మవుతోంది.