Begin typing your search above and press return to search.
పీకే 27కు కోహినూర్ డైమండ్ కు లింక్ ఏంటీ?
By: Tupaki Desk | 13 Feb 2020 11:21 AM ISTపవన్ కళ్యాణ్ 26వ చిత్రంగా పింక్ రీమేక్ తెరకెక్కుతుండగా 27వ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. 28వ చిత్రం హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోతుంది. ఈ మూడు సినిమాల్లో ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న పీకే 27 చిత్రం గురించి పెద్ద ఎత్తున మీడియా లో ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం కథ ఏంటీ.. అసలు ఏ నేపథ్యంలో ఈ చిత్రంను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్నాడు అంటూ నెటిజన్స్ తెగ వెదికేస్తున్నారు.
సినిమాపై ఉన్న ఆసక్తి నేపథ్యంలో రోజుకో వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. మెఘలాయిల కాలం నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని కూడా ప్రచారం జరిగింది. తాజాగా ఈ చిత్రం కథ మొత్తం కూడా అత్యంత విలువైన కోహినూర్ వజ్రం చుట్టు తిరుగుతుందని అంటున్నారు.
కాకతీయుల కాలంకు చెందిన కోహినూర్ వజ్రం చాలా చేతు మారింది. చివరకు బ్రిటీష్ వారు దాన్ని స్వాదీనం చేసుకున్నారు. అయితే మెఘలాయిల కాలంలో కోహినూర్ వజ్రంను వారి నుండి దొంగిలించే కాన్సెప్ట్ తో కథను సిద్దం చేసి క్రిష్ సినిమాను తెరకెక్కించేందుకు సిద్దం అయ్యాడు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అయ్యింది.
పింక్ రీమేక్ షూటింగ్ పూర్తి కాగానే పవన్ ఈ చిత్రం షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. కోహినూర్ వజ్రం కోసం తన టీంతో కలిసి పవన్ కళ్యాణ్ చేసిన పోరాటాలు ఏంటీ.. అప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది కళ్లకు కట్టినట్లుగా చూపించేందుకు దర్శకుడు క్రిష్ చాలా వర్కౌట్స్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మెఘలాయిల కాలంకు చెందిన కొన్ని సెట్స్ ను ప్రస్తుతం రీ క్రియేట్ చేయించే పనిలో క్రిష్ ఉన్నాడు. దసరా లేదా దీపావళికి ఈ చిత్రం వచ్చే అవకాశాలు ఉన్నాయి.