Begin typing your search above and press return to search.
వైరల్ పిక్: స్లిమ్ గా మారిన పవర్ స్టార్
By: Tupaki Desk | 8 May 2019 3:52 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనగానే ఎవరికైనా స్లిమ్ గా స్టైలిష్ గా ఉండే హీరో గుర్తొస్తారు. కానీ షూటింగ్ లేని సమయంలో మాత్రం ఆయన గెటప్ మారిపోయేది. ఒకసారి గడ్డం పెంచి కనిపిస్తే మరోసారి.. మీసాలు తీసేసి కనిపించేవారు. కానీ ఇదంతా సినిమాలలో ఉన్నప్పుడు. కానీ గత ఏడాది జనవరి నుండి సినిమాలకు దూరం జరిగి జనసేన పార్టీ కార్యకలాపాలలో బిజీ కావడంతో అయన తన లుక్స్ పై పెద్దగా శ్రద్ధ తీసుకోలేదు. వెయిట్ పెరగడం తో పాటుగా జుట్టు పెంచారు.. గడ్డం కూడా పెంచేశారు.
కానీ తాజాగా పవన్ కళ్యాణ్ లుక్ చూస్తే మాత్రం ఎవరైనా షాక్ తినాల్సిందే. గడ్డం.. పొడవాటి జుట్టు అలానే ఉంది కానీ పూర్తిగా స్లిమ్ గా మారిపోయారు. పవన్ గత కొద్దిరోజులుగా ఇండియాలో లేరని.. వెకేషన్ కోసం విదేశాలకు వెళ్ళారని గుసగుసలు ఉన్నాయి కానీ ఆయన ఎక్కడికి వెళ్ళారో మాత్రం తెలియదు. తాజాగా అయన ఎక్కడి నుంచో తిరిగి వస్తూ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. లైట్ బ్లూ కలర్ షర్టు.. జీన్స్ ప్యాంట్ లో ఉన్న పవన్ స్లిమ్ గా కనిపించారు.
ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరి పవన్ కళ్యాణ్ తన గడ్డం ఎప్పుడు తీసేస్తారో ఇంకా తెలీదు. ఎలెక్షన్ రిజల్ట్ తర్వాతే పవన్ క్లీన్ షేవ్ లుక్ లో కనిపిస్తారని అంటున్నారు. మరో రెండు రోజుల్లో పవన్ విజయవాడ కు వెళ్తారని అక్కడ పార్టీ వర్గాలతో భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చలు జరుపుతారని సమాచారం. ఇదిలా ఉంటే పవన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చే విషయంపై కూడా జోరుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.