Begin typing your search above and press return to search.

పవన్ ఈసారి కూడా పరేడేనా?

By:  Tupaki Desk   |   21 Nov 2015 7:57 AM GMT
పవన్ ఈసారి కూడా పరేడేనా?
X
నెల కిందట అమరావతి శంకు స్థాపనకు కూడా ఉండకుండా పవన్ కళ్యాణ్ గుజరాత్ లో షూటింగ్ అంటూ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ యూనిట్ మొత్తాన్ని వెంట బెట్టుకుని గుజరాత్ కు వెళ్లిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ దెబ్బతో మొత్తం షూటింగంతా పూర్తి చేసుకుని వచ్చేస్తాడేమో అనుకున్నారంతా. కానీ వారం రోజులు అక్కడా ఇక్కడా తిరిగి కేవలం లొకేషన్లు ఫైనలైజ్ చేసుకుని వచ్చేశాడు పవన్. ఆ టూర్ లో తన బాడీ గార్డులు - టీమ్ సభ్యులతో కలిసి పరేడ్ చేస్తున్న దృశ్యాలు ఆసక్తి రేకెత్తించాయి. ఐతే ఆ టూర్ కు సంబంధించి ఆ పరేడ్ గురించి తప్ప ఇంకేమీ మాట్లాడుకోవడానికి లేకపోయింది.

పవన్ ఇప్పుడు మళ్లీ గుజరాత్ టూర్ కు వెళ్లాడు. ఈసారి కూడా యూనిట్ సభ్యులందరినీ వెంటబెట్టుకునే వెళ్లాడు. ఐతే ఈసారి పెద్ద షెడ్యూలే ఉందని, కీలక సన్నివేశాలన్నీ ఈ షెడ్యూల్ లోనే పూర్తి చేసుకుని వస్తారని సమాచారం అందించారు. ఐతే ఈసారి కూడా సైలెంటుగా షూటింగ్ కానిచ్చేయకుండా పవన్ తన బాడీగార్డులతో కలిసి పరేడ్ చేస్తున్న, లొకేషన్లు పరిశీలిస్తున్న దృశ్యాల్ని లీక్ చేశారు. దీంతో ఈసారైనా షూటింగ్ చేస్తారా.. ఇలా పరేడ్ లతోనే సరిపెడతారా అని డౌట్లు వచ్చేస్తున్నాయి. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ మొదలైనప్పట్నుంచి కూడా ఇలా ఆన్ లొకేషన్ ఫొటోలైతే బాగానే హల్ చల్ చేస్తున్నాయి. ఐతే సినిమా ఏమాత్రం పూర్తయింది, ఇంకా షూటింగ్ ఎంత బ్యాలెన్స్ ఉంది అన్న అప్ డేట్లే తెలియట్లేదు.