Begin typing your search above and press return to search.

తెలుగులో పవన్ కళ్యాణ్.. తమిళంలో కార్తి.. నాగార్జున డేరింగ్ స్టేట్మెంట్..!

By:  Tupaki Desk   |   20 Oct 2022 4:36 AM GMT
తెలుగులో పవన్ కళ్యాణ్.. తమిళంలో కార్తి.. నాగార్జున డేరింగ్ స్టేట్మెంట్..!
X
కింగ్ నాగార్జున ఎప్పుడూ కూడా మైక్ దొరికింది కదా ఊరకనే ఏదో ఒకటి అని మాట్లాడరు. ఆయన ఏదైనా స్పెసిఫిక్ గా చెప్పారు అంటే అందులో ఖచ్చితంగా విషయం ఉండి ఉంటుంది.

అలాంటి నాగార్జున తమిళ హీరో కార్తి గురించి చెబుతూ అతన్ని పవన్ కళ్యాణ్ తో పోల్చడం హాట్ టాపిక్ గా మారింది. కార్తి నటించిన సర్ధార్ మూవీ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ మూవీ అన్నపూర్ణ స్టూడియోస్ తెలుగులో రిలీజ్ చేస్తుంది. సినిమా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి తమ సపోర్ట్ గా ప్రమోషన్స్ కి వచ్చారు నాగార్జున.

ఊపిరి సినిమాలో తను కార్తి తో కలిసి నటించానని.. అప్పటినుంచి ఆ బాండింగ్ అలానే కొనసాగుతుందని అన్నారు నాగార్జున. ఇక అన్నలు సూపర్ స్టార్స్ అయితే తమ్ముళ్లు కూడా అదే ఇమేజ్ సంపాదించడం చాలా కష్టమని. వారి షాడో నుంచి బయటకు వచ్చి సొంత ఇమేజ్ తెచ్చుకోవడం చాలా గొప్ప విషయమని అన్నారు.

అలా తనకు తెలిసిన వారిలో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్.. కన్నడ శివ రాజ్ కుమార్ తమ్ముడు పునీత్ రాజ్ కుమార్.. తమిళంలో సూర్య తమ్ముడు కార్తి అని చెప్పారు నాగార్జున. పవన్, పునీత్ రాజ్ కుమార్ లిస్ట్ లో కార్తి కూడా సొంత ఇమేజ్ తెచ్చుకున్నాడని అన్నారు కింగ్.

నాగార్జున చెప్పారని కాదు కానీ యుగానికి ఒక్కడు సినిమా నుంచి రిలీజ్ అవుతున్న సర్ధార్ వరకు తన సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్న కార్తి తమిళంతో పాటుగా తెలుగు ఆడియన్స్ ని కూడా అలరిస్తున్నారు. తమిళ హీరోల్లో తెలుగు భాష స్పష్టంగా మాట్లాడే చాలా తక్కువ మందిలో కార్తి ఒకరు.

అందుకే నాగార్జున కూడా తెలుగు మాట్లాడే వారిని మనం అస్సలు వదులుకోం కాబట్టి కార్తి కూడా మనతో ఉంచుకుందాం అన్నారు. ఈమధ్యనే కార్తి పొన్నియిన్ సెల్వన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీలో అతని నటనకు ఆడియన్స్ సూపర్ అనేయగా ఇప్పుడు సర్ధార్ తో మరోసారి మెస్మరైజ్ చేయాలని చూస్తున్నాడు. ఇండియన్ స్పై థ్రిల్లర్ గా సర్ధార్ మూవీ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కింది. మంచి కథతో వస్తున్న ఈ మూవీ ఫలితంపై కార్తి చాలా నమ్మకంగా ఉన్నాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.