Begin typing your search above and press return to search.
ట్రెండీ టాక్: అంజలి లవ్ లో పవన్ కళ్యాణ్..!
By: Tupaki Desk | 7 Aug 2020 9:30 AM ISTప్రేమకు వయసు అడ్డంకి కాదు. పైగా ఏజ్ బార్ హీరోలు ప్రేమ కలాపాలకు తెర తీయకపోతే అది సినిమాకి మైనస్ గా మారుతుందా? అందుకేనా? మన సీనియర్ హీరోలు వెటరన్లుగా మారాక కూడా లవ్ ట్రాక్ లు కావాలని అడుగుతారు? లేదా ఇంకా తమకు వయసు అయిపోలేదని నిరూపించేందుకు ఇలాంటి ప్లాన్ చేస్తుంటారా? ఇలాంటి యక్ష ప్రశ్నలకు ఆన్సర్ టాలీవుడ్ సీనియర్లను అడక్కూడదు. అందుకే.. ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసీ సమాధానం చెప్పకపోయావో నీ బుర్ర వెయ్యి చెక్కలగును భేతాళా అని హెచ్చరించాడు విక్రమార్కుడు.
భేతాళుడు ఆన్సర్ చెబుతాడా లేదా అన్నది అటుంచితే.. మన షష్ఠిపూర్తి వెటరన్లు మాత్రం ఇప్పటికీ 20 ప్లస్ హీరోయిన్లతో రొమాన్స్ కి ఎంతమాత్రం వెనకాడరన్నది జగమెరిగిన సత్యం. చిరంజీవి-బాలయ్య- వెంకీ- నాగార్జున వీళ్లంతా ఇందుకు అతీతులేమీ కాదు. కుర్రహీరోయిన్లతో రొమాన్స్ విషయంలో ఏఎన్నార్- ఎన్టీఆర్ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఏజ్ 50 కి రెండేళ్లు అటూ ఇటూగా ఉన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సైతం యువకథానాయికలతో రొమాన్స్ చేయబోతున్నారట.
మేటర్ లోకి వెళితే...! అంజలి లవ్ లో పడే లాయర్ గా పవన్ కనిపించబోతున్నారన్నది తాజా గుసగుస. వీరిద్దరూ కలిసి వకీల్ సాబ్ సినిమాలో కలిసి నటిస్తున్నారు..! ఐతే ఒరిజినల్ లో లేని లవ్ స్టోరీ ఇక్కడ పుట్టుకు రావడమే సందేహం రేకెత్తిస్తోంది. తెలుగు కి తగ్గట్లుగా పీకే కి ఒక లవ్ ఇంట్రెస్ట్ ని పెట్టారట మేకర్స్. ఆ లక్కీ ఛాన్స్ అంజలి కి వచ్చింది అని అంటున్నారు..! మరి పీకే అండ్ అంజలి లవ్ ట్రాక్ వకీల్ సాబ్ కి ఏ మేరకు ప్లస్ అవుతుంది? అన్నదే సస్పెన్స్. 30 ప్లస్సు అంజలి ఇంతకుముందు వెంకీ సరసన `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`లో నటించింది. రవితేజ సరసన నటించింది. ఇప్పుడు పవన్ తో జాక్ పాట్ కొట్టేసింది. అయితే ఎబ్బెట్టుగా లేని లవ్ ట్రాక్ ఈ జంట మధ్య కుదురుతుందా లేదా? అన్నదే ఇప్పుడు ఆలోచించాలి.