Begin typing your search above and press return to search.

అన్నయ్య కరోనా బారిన పడటంతో విస్తుపోయాం : పవన్‌

By:  Tupaki Desk   |   10 Nov 2020 5:00 PM IST
అన్నయ్య కరోనా బారిన పడటంతో విస్తుపోయాం : పవన్‌
X
చిరంజీవి కరోనా బారిన పడటంతో మెగా ఫ్యామిలీ ఆందోళనలో ఉంది. ఎలాంటి లక్షణాలు లేకున్నా కూడా కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అవ్వడంతో త్వరగానే చిరు కోలుకుంటారని అంతా ఆశిస్తున్నారు. చిరంజీవి ఆరోగ్య విషయమై అభిమానులు కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోలన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పవన్‌ కళ్యాణ్‌ అన్నయ్య చిరంజీవి ఆరోగ్యం విషయమై ప్రెస్‌ నోట్‌ విడుదల చేశారు. అన్నయ్య చిరంజీవి గారు సత్వరమే కోలుకోవాలంటూ కోరుకుంటున్నాను అంటూ పవన్‌ పేర్కొన్నాడు.

పవన్‌ ప్రెస్‌ నోట్ లో.. అన్నయ్య చిరంజీవి లాక్‌ డౌన్‌ ప్రకటించినప్పటి నుండి కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతి ఒక్కరిలో కూడా చైతన్యం కలిగించారు. సామాజిక బాధ్యతతో పలు కార్యక్రమాలు నిర్వహించిన ఆయన ప్రజారోగ్యంపై ఎంతో అవగాహన ఉన్న అన్నయ్య తన ఆరోగ్యం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా కూడా అన్నయ్య కరోనా బారిన పడటంతో మేమంతా కూడా విస్తుపోయాం.

ఎలాంటి లక్షణాలు లేవు.. పరీక్షలో మాత్రం పాజిటివ్‌ అని వచ్చింది. అన్నయ్య సత్వరమే కోలుకోవాలని ఆశిస్తున్నాను అంటూ పవన్‌ పేర్కొన్నారు. ఇదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఎదురు చూస్తున్న కోవిడ్‌ వ్యాక్సిన్‌ త్వరగా రావాలని కూడా కోరుకుంటున్నాను అన్నారు. సెకండ్‌ వెవ్‌ అంటూ వైధ్యులు హెచ్చరిస్తున్న ఈ సమయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలంటూ పవన్‌ సూచించారు.