Begin typing your search above and press return to search.

రేపే ‘వీర‌మ‌ల్లు’ అరంగేట్రం.. సిద్ధ‌మవుతున్న‌ ‘గండికోట’!

By:  Tupaki Desk   |   21 Feb 2021 1:00 PM IST
రేపే ‘వీర‌మ‌ల్లు’ అరంగేట్రం.. సిద్ధ‌మవుతున్న‌ ‘గండికోట’!
X
ఇప్పుడు టాలీవుడ్ లో ఫుల్ డిస్కషన్ లో ఉన్న సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - దర్శకుడు క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు(వర్కింగ్ టైటిల్). 15వ శతాబ్దం నాటి మొఘల్ సామ్రాజ్య పరిస్థితుల ఆధారం రూపొందుతున్న ఈ పీరియాడికల్ మూవీ పలు విషయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది.

ఈ చిత్రంలో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో బందిపోటుగా కనిపించనున్నారు. ఈ మూవీకోసం దాదాపు 170 కోట్ల రూపాయల ఖర్చు చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం నాటి పరిస్థితులను కళ్లకు కట్టేవిధంగా హైదరాబాద్ శివార్లలో భారీ సెట్స్ నిర్మిస్తున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ కెరీర్‌లోనే ఇది భారీ బ‌డ్జెట్ సినిమాగా నిల‌వ‌బోతోంది.

కాగా.. ఇప్ప‌టికే చార్మినార్ సెట్ వేశారు. దీంతోపాటు ‘గండి కోట’ సంస్థానానికి సంబంధించిన సెట్ ను కూడా సిద్ధం చేస్తున్నారు మేక‌ర్స్‌. రాజీవ‌న్ నేతృత్వంలో శ‌ర‌వేగంగా డిజైన్ చేస్తున్నారు. ఇవేకాకుండా.. హైద‌రాబాద్ లోని ఇతర చారిత్ర‌క క‌ట్ట‌డాల సెట్స్ కూడా వేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

అయితే.. ఈ చిత్రానికి సంబంధించి ఇప్ప‌టికే తొలి షెడ్యూల్ ముగిసింది. రెండో షెడ్యూల్ రేప‌టి నుంచి ప్రారంభం కాబోతోంది. ఫిబ్ర‌వ‌రి 22న ప్రారంభం కానున్న ఈ సెకండ్ షెడ్యూల్ ప‌ది రోజుల‌పాటు కొన‌సాగ‌నుంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌దిరోజుల‌పాటే డేట్లు కేటాయించార‌ట‌. ఈ షెడ్యూల్ లో కీల‌క స‌న్నివేశాల‌ను షూట్ చేయ‌నున్నాడ‌ట ద‌ర్శ‌కుడు.

ఇక‌, ఈ చిత్రానికి ‘హరిహర వీరమల్లు’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. త్వ‌ర‌లో టైటిల్ తోపాటు, ప‌వ‌న్ లుక్ కూడా రిలీజ్ చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ప‌వ‌న్ స‌ర‌స‌న నిధి అగర్వాల్, బాలీవుడ్ భామ‌ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ న‌టిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఏ.ఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ భారీ బ‌డ్జెట్ చిత్రానికి కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు.