Begin typing your search above and press return to search.

ప‌వ‌ర్ స్టార్ పంతం ఏంటో తెలిస్తే షాక్ తింటారు!

By:  Tupaki Desk   |   2 March 2021 6:33 AM GMT
ప‌వ‌ర్ స్టార్ పంతం ఏంటో తెలిస్తే షాక్ తింటారు!
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయాల్లోకి వెళ్లాక.. టాలీవుడ్ లో బిగ్ గ్యాప్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇంత‌ గ్యాప్ త‌ర్వాత అత‌డు వ‌కీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్నారు. అందుకే బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని ప్ర‌క‌టించినా రీఎంట్రీలో ఆరంగేట్ర సినిమా వ‌కీల్ సాబ్ పై ఎంతో శ్ర‌ద్ధ చూపిస్తున్నార‌ట‌. ఇదివ‌ర‌కూ షూటింగుకి అన్నివిధాలా త‌న‌వంతు స‌హ‌కారం అందించ‌డ‌మే గాక‌.. ఇప్పుడు ఎడిటింగ్ ల్యాబ్ లోనూ టీమ్ కి ప‌వ‌న్ అవ‌స‌ర‌మైన సూచ‌న‌లు స‌ల‌హాలు ఇస్తున్నార‌ట‌.

త‌న సుదీర్ఘ అనుభ‌వాన్ని జోడించి `వ‌కీల్ సాబ్`ని బ్లాక్ బ‌స్ట‌ర్ చేయాల‌న్న‌దే ప‌వ‌న్ పంతం అని తెలిసింది. గత ఏడాది డిసెంబర్ చివరి నాటికి వ‌కీల్ సాబ్ షూటింగ్ పూర్త‌యింది. ఈ ఏడాది ఏప్రిల్ 9న థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతోంది. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర ప‌నుల్లో భాగంగా ఎడిటింగ్ సాగుతోంది. దీనికి అవ‌స‌రం మేర ప‌వ‌న్ స్వ‌యంగా కొన్ని సూచ‌న‌లు చేస్తున్నార‌ని స‌మాచారం. అంతేకాదు.. ఎంతో ఓపిగ్గా ప‌ని జ‌రుగుతున్న ల్యాబులోనే రేయింబ‌వ‌ళ్లు అందుబాటులో ఉంటున్నార‌ట‌.

బాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ పింక్ కి తమిళ వెర్షన్ `నెర్కొండ పర్వై` పెద్ద హిట్ట‌య్యింది. అజిత్ త‌మిళంలో హీరోగా న‌టించారు. అంత‌కుమించి తెలుగు వెర్ష‌న్ విజ‌యం సాధించాల‌న్న‌ది ప‌వ‌న్ పంతం అని తెలిసింది. రెండో ఇన్నింగ్స్ ని గ్రాండ్ గా స్టార్ట్ చేయాల‌న్న ఉత్సాహం ప‌వ‌న్ లో క‌నిపిస్తోంద‌ట‌. అందుకే ఇంత శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తున్నార‌ని తెలిసింది. యువ‌ద‌ర్శ‌కుడు వేణు శ్రీ‌రామ్ కి ప‌వ‌న్ సూచ‌న‌లు బాగానే అక్క‌ర‌కొస్తాయ‌న‌డంలో సందేహ‌మేం లేదు. వ‌కీల్ సాబ్ టీజ‌ర్ అనంత‌రం ట్రైల‌ర్ కోసం ప‌వ‌న్ అభిమానులు ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. ఈ మూవీలో శ్రుతిహాస‌న్ కీల‌క పాత్ర‌లో న‌టించారు.