Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ సినిమా నాలుగు నెల‌ల్లో అయిపోతుంది

By:  Tupaki Desk   |   22 Jun 2016 4:41 AM GMT
ప‌వ‌న్ సినిమా నాలుగు నెల‌ల్లో అయిపోతుంది
X
ఎప్ప‌ట్లాగే రెగ్యుల‌ర్ షూటింగ్ ఆనుకున్న స‌మ‌యానికి ఆరంభం కాలేదు. పైగా ద‌ర్శ‌కుడు కూడా మారాడు. కాబ‌ట్టి ప‌వ‌న్ అభిమానుల‌కు మ‌రోసారి నిరీక్ష‌ణ త‌ప్ప‌దేమో.. ప‌వ‌న్ సినిమా మ‌ళ్లీ డోలాయ‌మానంలో ప‌డుతుందేమో అనుకున్నారంతా. కానీ సినిమా ఏమాత్రం ఆల‌స్యం కాబోద‌ని.. అనుకున్న ప్ర‌కార‌మే ఈ ఏడాదే పూర్త‌వుతుంద‌ని అంటున్నారు ప‌వ‌న్ స‌న్నిహితులు. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా పూర్తి చేయ‌డానికి ప‌వ‌న్.. ద‌ర్శ‌కుడు డాలీకి నాలుగు నెల‌ల స‌మ‌య‌మే ఇచ్చాడ‌ట‌. జులైలో మొద‌లుపెట్టి న‌వంబ‌రులోపు సినిమా పూర్తి చేసేలా ప‌క్కా ప్లాన్ సిద్ధం చేశాడ‌ట ప‌వ‌న్‌. ప్ర‌స్తుతం క‌థార‌చ‌యిత ఆకుల శివ‌తో క‌లిసి డాలీ స్క్రిప్టును స్ట‌డీ చేసే ప‌నిలో ఉన్నాడట‌.

త‌న మిత్రుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న‌ త‌ర్వాతి సినిమాను న‌వంబ‌రులో మొద‌లుపెట్ట‌డానికి ప‌వ‌న్ ప్లాన్ చేసుకున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే త్రివిక్ర‌మ్ స్క్రిప్టు ప‌ని మొద‌లుపెట్టేశాడు. అత‌ను న‌వంబ‌రు వ‌ర‌కు స‌మయం అడిగాడట‌. ఆ నెల‌లోనే రాధాకృష్ణ నిర్మాణంలో ఈ చిత్రం మొద‌లు పెట్టాల‌న్న‌ది ప్ర‌ణాళిక‌. ఆలోపే డాలీ.. క‌డ‌ప కింగ్ (వ‌ర్కింగ్ టైటిల్)ను పూర్తి చేయాల్సి ఉంటుంది. డాలీ ఇంత‌కుముందు ప‌వ‌న్ తో ‘గోపాల గోపాల’ సినిమా చేశాడు. అది ఆరు నెల‌ల లోపే పూర్త‌యింది. ఆ వేగం చూసే న‌మ్మ‌కంగా త‌న ప్రాజెక్టును డాలీ చేతుల్లో పెట్టాడు ప‌వ‌న్. శ‌త‌ర్ మరార్ నిర్మించ‌బోయే ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ క‌థానాయిక‌. అనూప్ రూబెన్స్ సంగీత ద‌ర్శ‌కుడు.