Begin typing your search above and press return to search.
పవన్ క్లారిటీ ఇచ్చేశాడుగా.!
By: Tupaki Desk | 13 May 2019 2:46 PM ISTఇంకో 10 రోజుల్లో ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. అధికారం ఎవరిదో, ప్రతిపక్షంలో ఎవరు కూర్చోబోతున్నారో మరో పదిరోజుల్లో తేలిపోతుంది. అటు టీడీపీ, ఇటు వైసీపీ ఎవరికి వారే అధికారం తమదే అనే అంచనాల్లో ఉన్నారు. కానీ ఎటొచ్చి.. అటు అధికారానికి, ఇటు విపక్ష పాత్రకు దూరంగా ఉండిపోబోతుంది జనసేన. ఒకవేళ టీడీపీ, వైసీపీకి ఇద్దరికి సరైన మెజారిటీ రాకపోతే.. అప్పుడు పవన్ కింగ్‌మేకర్ అవుతారు. కానీ సర్వేల్ని బట్టి చూస్తుంటే అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చనే తెలుస్తుంది.
పవన్ కింగ్ మేకర్ అయితే ఓకే. కాకపోతే.. వచ్చే ఐదేళ్లు ఏం చెయ్యాలి అనే ప్రశ్న పార్టీల్లో వర్గాల్లో వచ్చింది. దీంతో.. పవన్ మళ్లీ సినిమాలు చేయబోతున్నాడని, సినిమాలతో పాటు పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటాడని వార్తలు వచ్చాయి. ఆల్ రెడీ మైత్రీ మూవీస్ దగ్గర పవన్ అడ్వాన్స్ తీసుకున్నాడు కాబట్టి సినిమాలు చేయడం పక్కా అని కొంతమంది వాదించారు. కానీ ఈ వాదనలన్నింటికి నిన్నటి కార్యకర్తల మీటింగ్ లో ఫుల్ స్టాప్ పెట్టేశారు పవన్. అధికారంలో ఉన్నా, లేకపోయినా.. జనసేన ఇవాళ్టి రోజు కోసం ఉద్భవించింది కాదని.. రాబోయే 25 ఏళ్లే తమ టార్గెట్ అని ప్రకటించారు పవన్.
ఎన్నికల ఫలితాల తర్వాత జనసేన రాష్ట్రంలో చురుకైన పాత్ర పోషిస్తుందని పవన్ కల్యాణ్ అన్నాడు. ప్రజల సమస్యలే అజెండాగా దూసుకెళ్లాలని.. అధికార, విపక్షాలు ఒకర్ని ఒకరు దుమ్మెత్తిపోసుకోవడంలో బిజీగా ఉంటాయి కాబట్టి.. మనం ప్రజల పక్షాన పోరాడాలని అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చాడు. దీన్నిబట్టి పవన్ ఇక సినిమాల జోలికి వెళ్లకపోవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి. మొన్నటికి మొన్న నాగబాబు కూడా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. పవన్ సినిమాలు చేయకపోవచ్చని తేల్చి చెప్పేశాడు.