Begin typing your search above and press return to search.

పవన్ గబ్బర్ సింగ్ కాదు సర్దార్

By:  Tupaki Desk   |   23 July 2015 4:20 AM GMT
పవన్ గబ్బర్ సింగ్ కాదు సర్దార్
X
గబ్బర్ సింగ్ 2 సినిమా మొదలుకాకముందే దర్శకుడిని మర్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేసాడు పవన్ కళ్యాణ్. ఆ తరువాత అసలు మొదలు కాదేమో అనుకున్న గబ్బర్ సింగ్ 2 షూటింగ్ ను మొదలుపెట్టాడు. ఈ సినిమా చిత్ర యూనిట్ కొన్ని రోజుల క్రితం మహరాష్ట్రలో షూటింగ్ జరపుకుని వెనక్కి వచ్చింది.

మొదటి షెడ్యుల్ మొదలవగానే హీరోయిన్ అనీషా పెర్ ఫార్మెన్స్ పవన్ కు నచ్చలేదని, మార్చే ఉద్దేశంలో వున్నారని వార్తలు వచ్చాయి. లేటెస్ట్ గా ఈ సినిమాకి సంబంధించి మరో న్యూస్ బయటకి వచ్చింది. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ 2 టైటిల్ ని సర్దార్ గా మార్చారట. ఈ సినిమా స్టోరి గబ్బర్ సింగ్ కి దగ్గరగా వున్న , పవన్ సర్దార్ అయితే యాప్ట్ గా ఉంటుందని అలోచించి మరి నిర్ణయించాడట.

మొత్తానికి గబ్బర్ సింగ్ మార్పుల సంచనాలను మాత్రం కొనసాగుతూనే వున్నాయి. త్వరలో ఈ సినిమా రెండో షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం కాబోతుంది. పవన్ తో పాటు పలువురు సపోర్టింగ్ నటులు, కమెడియన్ లు కూడా ఈ షెడ్యూలు లో పాల్గొంటారు. అయితే హీరోయిన్ అనీష ఆంబ్రోస్ కాదని కూడా టాక్ వినిపిస్తోంది. ఈ షెడ్యూల్ తరువాత పవన్ ఎవరిని తొలగిస్తాడోనని చిత్ర యూనిట్ కలవరపడుతుందట.