Begin typing your search above and press return to search.

ప‌వ‌ర్ స్టార్ ఫైరింగ్.. ఇంత‌కీ ఏమైంది?

By:  Tupaki Desk   |   3 Feb 2020 3:30 AM GMT
ప‌వ‌ర్ స్టార్ ఫైరింగ్.. ఇంత‌కీ ఏమైంది?
X
ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక‌దాని వెంట ఒక‌టిగా సినిమాల్ని ప్రారంభిస్తూ వేడెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. #PSPK26 .. #PSPK27 ఇప్ప‌టికే ప్రారంభించేశాడు. ఇక వీటితో పాటు #PSPK28 హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రి సంస్థ నిర్మించ‌నుంది. ఆ మేర‌కు మైత్రి వాళ్లు అధికారిక ప్ర‌క‌ట‌న‌ను చేసేయ‌డం హీటెక్కించింది.

ప‌వ‌న్ మ‌రీ ఇంత స్పీడ్ మీదున్నాడేమిటి? అస‌లేమైంది? ఒక‌టి పూర్త‌వ్వ‌కుండానే ఇంకొక్క‌టి మ‌రొక‌టి అంటూ వేడెక్కించేస్తున్నాడు. వెంట వెంట‌నే ప్రారంభించేస్తున్నాడేమిటిలా? అన్న చ‌ర్చ సాగుతోంది. అయితే ఇప్ప‌టివ‌ర‌కూ ఒక‌టి సెట్స్ పై ఉండ‌గా.. ఇంకొక‌టి ప్రారంభించాడు. కానీ ఆ రెండిటికీ ప్రచారార్భాటం అస్స‌లు లేనేలేదు. చివ‌రి వ‌ర‌కూ సినిమా మొద‌ల‌య్యే వ‌ర‌కూ ప‌వ‌న్ న‌టిస్తున్నాడ‌న్న విష‌యాన్ని ఎక్క‌డా అధికారికంగా ప్ర‌క‌టించిందే లేదు. అందుకు ప‌వ‌న్ నుంచి అనుమ‌తి కూడా లేదు.

అయితే ఒక‌దాని వెంట ఒక‌టిగా రెండు సినిమాలు ప్రారంభించే స‌రికి త‌మ చెయ్యి దాటిపోతున్నాడా? అని భావించిన మైత్రి సంస్థ వెంట‌నే #PSPK28ని అధికారికంగా ప్ర‌క‌టించేసింది. ప‌వ‌న్ - హ‌రీష్ కాంబినేష‌న్ లో మూవీ చేస్తున్నామ‌ని రివీల్ చేసింది. దిల్ రాజు - ఏఎం ర‌త్నం వంటి నిర్మాత‌ల‌కు ప‌వ‌న్ వెంట‌నే ఓకే చెప్పేశాడు క‌దా.. త‌మ నుంచి అడ్వాన్స్ తీసుకున్న ప‌వ‌న్ త‌మ‌కు చిక్క కుండా వెళ్లిపోతున్నాడా? అన్న ఆందోళ‌న మైత్రిలో క‌నిపించింది. అందుకే వాళ్లు కాస్త చొర‌వ తీసుకుని ఇక‌నైనా చేజార్చుకోకూడ‌దు! అన్న పంతంతో ఆ ప్ర‌క‌ట‌న చేశార‌ని భావిస్తున్నారు. అయితే త‌న అనుమ‌తి లేకుండా మైత్రి వాళ్లు ఇలా ప్ర‌క‌టించేయ‌డంతో ప‌వ‌న్ కాస్త సీరియ‌స్ అయ్యార‌ని తెలుస్తోంది. అయితే మైత్రికి క‌మిట్ అయ్యి ఉన్నాడు కాబ‌ట్టి త‌ప్ప‌నిస‌రిగా సినిమా చేయాల‌న్న ఉద్ధేశాన్ని ప‌వ‌న్ వ్య‌క్తం చేశారట‌.