Begin typing your search above and press return to search.

బన్నీ కంఠశోష.. బూడిదలో పోసిన పన్నీరు

By:  Tupaki Desk   |   2 July 2016 5:35 AM GMT
బన్నీ కంఠశోష.. బూడిదలో పోసిన పన్నీరు
X
పాపం ఎంతో ప్రిపేరై వచ్చి మరీ.. పావు గంట పాటు కష్టపడి పవన్ కళ్యాణ్ అభిమానుల్ని దారిలోకి తెచ్చే ప్రయత్నం చేశాడు అల్లు అర్జున్. ‘ఒక మనసు’ ఆడియో వేడుకలో బన్నీ.. పవర్ స్టార్ ఫ్యాన్స్ ను ఎంతగా కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడో అందరూ చూశారు. మామూలుగా చాలామంది హీరోలు బయటికి మాట్లాడ్డానికి ఇష్టపడని విషయాలు కూడా ప్రస్తావించి.. చాలా ఓపెన్ గా అన్ని విషయాలూ చర్చించి.. పవన్ అభిమానుల తీరును మార్చే ప్రయత్నం చేశాడతను. ఆ ప్రసంగంలో బన్నీ ఇచ్చిన ఫినిషింగ్ టచ్ చూస్తే.. ఇంతటితో వివాదానికి తెరపడినట్లే అని భావించారంతా. బన్నీలో కూడా ఆ కాన్ఫిడెన్స్ కనిపించింది. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే అదేమీ లేదని అర్థమవుతోంది.

తాజాగా సింగపూర్లో ‘సైమా’ వేడుకలకు హాజరైతే అక్కడ కూడా బన్నీకి పాత అనుభవమే ఎదురైంది. అతణ్ని చూడగానే గ్యాలరీల్లోంచి జనాలు పవర్ స్టార్ నినాదాలు మొదలుపెట్టేశారు. ప్రసంగానికి అడ్డుపడే ప్రయత్నం చేశారు. దీంతో బన్నీకి ఒళ్లు మండింది. ‘గమ్మునుండువయ్యా.. మాట్లాడనీ’ అంటూ అభిమానులకు రిటార్ట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు బన్నీ. అయినా నినాదాలు ఆగలేదు. దీంతో మళ్లీ సోషల్ మీడియాలో ‘బన్నీ వెర్సస్ పవన్ ఫ్యాన్స్’ టాపిక్ చర్చనీయాంశంగా మారిపోయింది. బన్నీ ఆ రోజు అంతగా గొంతు చించుకున్నా.. అభిమానుల్లో మార్పేమీ రాలేదే అని మెగా ఫ్యామిలీ హీరోలు.. నాన్ పవన్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మరి ఈ వివాదం ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.