Begin typing your search above and press return to search.
బురదలో రాళ్ళేయడం ఎందుకులే అని ఆలోచిస్తున్నారా...?
By: Tupaki Desk | 24 July 2020 2:45 PM ISTకాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ ''పవర్ స్టార్'' అనే సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే. వర్మ ఈ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై వ్యగ్యంగా తీస్తున్న సినిమా అని అందరికి తెలిసిందే. అయినా సరే 'పవర్ స్టార్' మూవీ నిజ జీవితంలోని ఏ వ్యక్తిని ఉద్దేశించి తీసింది కాదని.. పొలిటికల్ పార్టీ స్థాపించి ఎన్నికలలో ఓడిపోయిన ఓ స్టార్ హీరోపై అల్లిన ఫిక్షనల్ స్టోరీ అని.. ఏ వ్యక్తికైనా దగ్గర పోలికలు ఉంటే అది యాదృచ్చికంగా జరిగింది మాత్రమేనని చెప్తూ మరింతగా రెచ్చ గొడుతున్నారు. పవన్ కళ్యాణ్ ని పోలిన ప్రవన్ కళ్యాణ్ ని ప్రధాన పాత్రగా పెట్టడంతో పాటు చిరంజీవిని పోలిన క్యారెక్టర్ ని కూడా ఇన్వాల్వ్ చేసాడు. అంతేకాకుండా 'పవర్ స్టార్' సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి డైలీ పవన్ కళ్యాణ్ ని ఇండైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ ఏదొక ట్వీట్ పెడుతూనే ఉన్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఆర్జీవీ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కానీ మెగా ఫ్యామిలీ నుండి ఎవరూ దీనిపై స్పందించలేదు.
''పవర్ స్టార్'' ట్రైలర్ రిలీజైనప్పటి నుంచి వర్మపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోపోద్రిక్తులై ఉన్నారు. ఈ క్రమంలో వర్మ ఆఫీస్ పై కూడా దాడి చేసారు. ఇక మెగా ఫ్యామిలీకి సంభంధం లేని హీరో నిఖిల్ కూడా ఆర్జీవీపై ఇండైరెక్ట్ గా ట్వీట్ చేసి ఇష్యూలో తల దూర్చాడు. మరో హీరో విశ్వక్ సేన్ కూడా వర్మ తీరు పట్ల నిరసన తెలియాజేస్తూ అతని ఫొటోలన్నీ తన సోషల్ మీడియా మాధ్యమాల నుంచి తొలగించాడు. ఇలా మెగా ఫ్యామిలీ అవుట్ సైడర్స్ ఈ ఇష్యూలో కలుగజేసుకుంటున్నా మెగా హీరోలు మాత్రం రియాక్ట్ అవడం లేదు. గతంలో శ్రీరెడ్డి వివాదం తలెత్తినపుడు మెగా ఫ్యామిలీ మొత్తం బయటకు వచ్చి నిరసన తెలిపారు. అల్లు అర్జున్ - నాగబాబు - అల్లు అరవింద్ - వరుణ్ తేజ్ - సాయి ధరమ్ తేజ్ - అల్లు శిరీష్ లతో పాటు బన్నీ వాసు లాంటి వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా నిలబడ్డారు. అల్లు అరవింద్ అయితే ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ రామ్ గోపాల్ వర్మని కడిగేశారు. అలాంటిది ఇప్పుడు ఇప్పుడు మాత్రం సైలెంటుగా ఉన్నారు. ఇక ప్రతి విషయంలో రియాక్ట్ అయ్యే నాగబాబు కూడా ఆర్జీవీ పవర్ స్టార్ విషయంలో రియాక్ట్ అవడం లేదు.
నిజానికి వర్మ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పేరు చెప్పకుండా అతనికి సంభందించిన అన్ని విషయాలను ప్రస్తావించాడు. ఎన్నికలలో ఓడిపోయాడని దెప్పి పొడుస్తూనే.. తన పర్సనల్ లైఫ్ విషయాలను కూడా ప్రస్తావించారు. ఫ్యాన్స్ సైతం ఇన్ని రోజులు సంయమనం పాటించినప్పటికీ వర్మ చర్యలు మితిమీరడంతో ఆయన కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. ఇంత జరుగున్నా అల్లు అరవింద్ కానీ నాగబాబు కానీ మెగా హీరోలు కానీ దీనిపై స్పందించకపోవడం మెగా ఫ్యాన్స్ ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ కి ఆయన ఫ్యాన్స్ కి అండగా ఉండాలని వారు కోరుకుంటున్నారు. అయితే బురదలో రాళ్లు వేస్తే మన మీదే పడుతుందని.. వర్మ ఇష్యూలో జోక్యం చేసుకోవడం కూడా అలానే ఉంటుందని మెగా హీరోలు సైలెంటుగా ఉంటున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆర్జీవీపై రియాక్ట్ అయినా అతను ఆ విషయాన్ని అక్కడితో వదిలేసే టైప్ కాదు. మళ్ళీ ఆ వివాదాన్ని మరింత పెద్దది చేసి లాభపడాలని చూసే రకమనే విషయం అందరికి తెలిసిందే. అందుకే మెగా ఫ్యామిలీ వర్మ 'పవర్ స్టార్' ని లైట్ తీసుకొని సైలెంటుగా ఉంటున్నారని మెగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు.