Begin typing your search above and press return to search.

పవన్ ఫ్యాన్.. మహేష్ ను ఏం పొగిడాడులే

By:  Tupaki Desk   |   20 April 2018 11:09 PM IST
పవన్ ఫ్యాన్.. మహేష్ ను ఏం పొగిడాడులే
X
నిన్న రాత్రి నుంచి మీడియా మీద పెద్ద యుద్ధమే చేస్తున్నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. శ్రీరెడ్డి వ్యవహారంలో మీడియా తీరును పవన్ తీవ్ర స్థాయిలో దుయ్యబట్టాడు. తనకు వ్యతిరేకంగా మీడియాలో కుట్ర జరుగుతోందంటూ మీడియా సంస్థల అధినేతల్ని నేరుగా టార్గెట్ చేశాడు. సరిగ్గా ఇలాంటి తరుణంలోనే విడుదలైన మహేష్ బాబు కొత్త సినిమా ‘భరత్ అనే నేను’లో మీడియాను టార్గెట్ చేసే కీలకమైన సన్నివేశం అందరిలోనూ ఆసక్తి రేకెత్తించింది. సెలబ్రెటీల వ్యక్తిగత విషయాలపై మీడియా ప్రదర్శించే అత్యుత్సాహాన్ని ఇందులో మహేష్ తప్పుబడతాడు. ఈ సీన్లో డైలాగులు భలేగా పేలాయి. ఈ సన్నివేశానికి థియేటర్లలో మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది.

ఈ నేపథ్యంలో ఒక పవన్ కళ్యాణ్ అభిమాని ‘భరత్ అనే నేను’ సినిమా చూసిన అనంతరం మీడియా ముందు చాలా ఆవేశంగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను పవన్ ఫ్యాన్ అని.. అయినప్పటికీ ‘భరత్ అనే నేను’ తనకు చాలా నచ్చిందని.. ఇలాంటి సినిమాను ఒప్పుకున్నందుకు మహేష్ బాబుకు హ్యాట్సాఫ్ అని.. ఈ సినిమా తీసినందుకు కొరటాల శివకు కూడా హ్యాట్సాఫ్ అని అతనన్నాడు. సినిమాలో మీడియా తీరును దుయ్యబట్టే సీన్ సూపర్ అని.. మీడియా పనికి మాలిన విషయాల బదులు సమస్యల మీద ఫోకస్ చేస్తే చాలా మంచి జరుగుతుందన్న మహేష్ డైలాగ్ సూపరని అన్న ఆ వ్యక్తి.. తన వీడియోను టీవీ ఛానెళ్లన్నింటికీ చూపించాలని అన్నాడు. ఇది ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా అని అతనన్నాడు. తాను బ్రాహ్మణుడినని.. కాపునో కమ్మనో కాదని కూడా అతను పంచ్ వేయడం విశేషం.

పవన్ నిజ జీవితంలో.. మహేష్ సినిమాలో ఇలా ఒకే ఇష్యూ మీద పోరాడటం విశేషమే. ఇక శుక్రవారం తన తల్లి పుట్టిన రోజు నేపథ్యంలో ‘భరత్ అనే నేను’ హిట్టవడంపై చాలా సంతోషంతో ట్వీట్ చేశాడు మహేష్. అదే సమయంలో తన తల్లి మాటెత్తుతూ శ్రీరెడ్డి బూతు తిట్టిన నేపథ్యంలో పవన్ తీవ్ర ఆవేదనతో ట్వీట్ వార్ మొదలుపెట్టి ఫిలిం ఛాంబర్ దగ్గరా నిరసన వ్యక్తం చేశాడు. మొత్తానికి ఇద్దరు సూపర్ స్టార్ల జీవితాల్లో ఈ కోయిన్సిడెన్సెస్ ఆశ్చర్యకరమే.

వీడియో చూడటానికి క్లిక్ చేయండి