Begin typing your search above and press return to search.

అజ్ఞాతవాసిపై చేనేత ప్రేమ చూశారా

By:  Tupaki Desk   |   10 Jan 2018 8:46 AM GMT
అజ్ఞాతవాసిపై చేనేత ప్రేమ చూశారా
X
టాలీవుడ్ లో ప్రస్తుతం అజ్ఞాతవాసి హంగామా మొదలైంది. యూఎస్ ప్రీమియర్స్ ద్వారా హిట్టు బొమ్మ అని ముద్ర పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో సినిమాపై అంచనాలు ఇంకా ఎక్కువ స్థాయిలో పెరిగాయి. మొదట ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు అని తెలంగాణ లో ప్రచారం జోరుగా సాగింది. కానీ చివరి గంటల్లో న్యూస్ ఒక్కసారిగా రివర్స్ అయ్యింది. ఇకపోతే ఆంధ్రలో పవన్ అభిమానులు ఇప్పటికే మొదటి రెండు షోలను చూసేశారు.

దీంతో ప్రస్తుతం అభిమానులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్స్ లో పేపర్ బ్యాగ్స్ తో తీసుకొని పవన్ ఎంట్రీ ఇవ్వగానే పేపర్స్ ఓ రేంజ్ లో ఎగిరాయి. మరో పక్క ఇతర స్టార్ హీరో అభిమానులు కూడా అజ్ఞాతవాసి సినిమాకు ఆల్ ది బెస్ట్ చెబుతూ ఫ్లెక్సీ లతో దర్శనం ఇస్తున్నారు. దీంతో పవన్ ఫ్యాన్స్ కూడా అందుకు చాలా హ్యపీ అవుతున్నారు. అజ్ఞాతవాసి ఫ్లెక్సీ లకు పాలభిషేకలు చేస్తూ కటౌట్ లను బారి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఒక అభిమాని మాత్ర ఎవరు చేయని విధంగా తన వృత్తితో అభిమానాన్ని చాటుకున్నాడు.

ధర్మవరనికి చెందిన ఒక చేనేత కార్మికుడు అజ్ఞాతవాసి స్టిల్ ని చీర పై వచ్చెట్లు నేత నేశాడు. ప్రస్తుతం ఆ చీరకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. నిజంగా పవన్ అభిమానులు ఆయనను ఎంతగా ఇష్టపడతారో ఇంతకంటే ఉదాహరణ మరొకటి అవసరం లేదు. హిట్టు ఉన్నా లేకున్నా పవన్ అభిమానులు ఎప్పుడు ఆయన వెంటే ఉంటారని అందరికి తెలిసిందే. మరి అజ్ఞాతవాసితో పవన్ ఇంకెంతమంది అభిమానులను సంపాదించుకుంటాడో చూడాలి.