Begin typing your search above and press return to search.
వ్వాటే పీకే ఫ్యాన్ ఆర్ట్!
By: Tupaki Desk | 2 Sept 2018 10:37 AM ISTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి అలాంటిలాంటి గిఫ్ట్ కాదు ఇది. ఆయన బర్త్ డే రోజు అభిమాని ఇచ్చిన సర్ ప్రైజ్ సూపర్బ్. పవర్ స్టార్ పై ఎంత అభిమానం ఉంటే ఇది సాధ్యం? పవన్ అంటే ప్రాణం పెట్టి గీసిన చిత్తరువు ఇది. అసలు పవన్ స్ఫురద్రూపాన్ని కేవలం అతడి సినిమాల టైటిల్స్ తోనే దించేయాలన్న ఆలోచనకే హ్యాట్సాఫ్ చెప్పాలి. ఆ ఆలోచన మనిషి రూపంగా మారడం చూస్తుంటే సృష్టికి ప్రతిసృష్టి అనే చెప్పాలి. పీఎస్ పీకే గ్రేట్ ఫ్యాన్ ఆర్ట్ ఫెంటాస్టిక్.
ఈ ఆర్ట్ ని అతడు రకరకాల కోణాల్లో ఆలోచించి కుంచెను చేపట్టాడు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే ఆయనకో బ్రాండ్ మ్యానరిజం ఉంది. ఆ చేతిని మెడమీదికి పోనిచ్చి రుద్దేస్తూ ఆయనిచ్చే ల్యాండ్ మార్క్ ఫోజుని ఎంపిక చేసుకుని - ఆ బాడీ మొత్తం టైటిల్స్ ని పంప్ చేసి స్కెచ్ వేశాడు. `సుస్వాగతం`కి పవన్ కల్యాణ్ పేరును జాయింట్ చేస్తే మెడలో ఎర్ర కండువా.. పవన్ మార్క్ ఎడమ చేతివాటం.. బద్రి - గుడుంబా శంకర్ - ఖుషీ టైటిల్స్ తో తీర్చిదిద్దాడు. ఇక తలకట్టుపై జనసేన పీకే అంటూ అద్భుతంగా సెట్టయ్యింది. కుడిచేతికి అక్కడ అమ్మాయి ఇక్కడబ్బాయి - గోకులంలో సీత - తొలి ప్రేమ చిత్రాల టైటిల్స్ ని ఉపయోగించుకున్నాడు.
హ్యాపి బర్త్ డే అంటూ ఆ పాదాల్ని అద్భుతంగా మార్చేశాడు. ఇక బాడీ - స్కెలెటిన్ మొత్తం పవన్ సూపర్ హిట్ సినిమాల టైటిల్స్ అన్నీ అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. పెయింటింగ్ మొత్తం లైట్ బ్లూ - డార్క్ బ్లూ - బ్లాక్ - రెడ్ కాంబినేషన్ తో ఎంతో ప్రొఫెషనల్ గా తీర్చిదిద్దిన తీరు మైమరిపిస్తుంది. పవన్ పాతికేళ్ల కెరీర్ లో నటించింది కేవలం 25 సినిమాల్లోనే. ఆ టైటిల్స్ అన్నిటినీ ఉపయోగించుకుని శంకర్ అనే ఆర్టిస్టు తీర్చిదిద్దిన శిల్పం ఇది. హ్యాట్సాఫ్ టు హిమ్.