Begin typing your search above and press return to search.
పవన్ తో సినిమా.. వీళ్ల కెరీర్ కెవ్వుకేక
By: Tupaki Desk | 10 April 2016 11:00 AM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీలో ఓ కేరక్టర్ చేసే అవకాశం రావడమో, ఆయన సినిమాకి వర్క్ చేయడమో అంటే.. చాలామంది తమ కల నెరవేరినట్లే అనుకుంటూ ఉంటారు. సర్దార్ గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ ఇలాంటి బంపరాఫర్ చాలామందికే ఇచ్చాడు. ట్యాలెంట్ ని వెతికి పట్టుకుని ఎంకరేజ్ చేయడంలో.. పవన్ సిద్ధహస్తుడు అని.. మెగాస్టార్ చిరంజీవి నోటివెంట ప్రశంస వచ్చిదంటే.. పవన్ ఈ విషయంలో ఎంతటి ఎక్స్ పర్టో అర్ధమవుతుంది.
నటులు శరద్ కేల్కర్ - ఆర్కే - టెక్నీషియన్స్ హరీష్ పాయ్ - భాను - డీజే పృథ్వీలకు సర్దార్ గబ్బర్ సింగ్ తో బ్రేక్ వచ్చిందని చెప్పాలి. కొరియాగ్రాఫర్ హరీష్ పాయ్.. ఈ మూవీ ద్వారా క్రియేటివ్ డైరెక్టర్ గా ప్రమోట్ అయ్యాడు. ఇక మట్కా శ్రీనుగా యాక్ట్ చేసిన ఆర్కే ఆనందానికి అవధులు లేవు. 8 ఏళ్ల క్రితం హైద్రాబాద్ నవాబ్స్ చూసినప్పుడు చెప్పిన మాటను... పవన్ గుర్తుపెట్టుకుని ఇన్నేళ్ల తర్వాత ఆఫర్ ఇవ్వడంతో ఆశ్చర్యపోయాడట. సైడ్ కేరక్టర్లు చేసుకునే ఆర్కేకి.. ఓ మెయిన్ రోల్ ఇవ్వడంతో.. ఇతగాడి లైఫ్ దాదాపు మారిపోయింది.
ఇక శరద్ కేల్కర్ అయితే.. పవన్ కళ్యాణ్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ తోనే తాను ఈ రోల్ చేశానంటున్నాడు. ఆడిషన్ లో సెలక్ట్ అయినపుడు కూడా లేని కాన్ఫిడెన్స్... పవన్ తో మాట్లాడినపుడు మాత్రం వచ్చిందట.