Begin typing your search above and press return to search.

కుక్క మొరిగితే శిఖ‌రం త‌ల తిప్పి చూడ‌దు అంటే ఇదేనా

By:  Tupaki Desk   |   23 July 2020 9:45 AM IST
కుక్క మొరిగితే శిఖ‌రం త‌ల తిప్పి చూడ‌దు అంటే ఇదేనా
X
అవును.. `కుక్క మొరిగితే శిఖ‌రం త‌ల తిప్పి చూడ‌దు` అని నిఖిల్ అన్న మాటే నిజ‌మైంది. ఆర్జీవీ అలియాస్ రామ్ గోపాల్ వ‌ర్మ `ప‌వ‌ర్ స్టార్` సినిమా పేరుతో ప‌వ‌న్ క‌ల్యాణ్ ని అవ‌మానించేందుకు కంక‌ణం క‌ట్టుకోవ‌డంపై చ‌ర్చ సాగుతోంది. ప‌వ‌ర్ స్టార్ ట్రైల‌ర్ లో ప‌వ‌న్ ని కించ‌ప‌రిచే.. ఘోరంగా అవ‌మానించే పంచ్ డైలాగులు ఉద్ధేశ‌పూర్వ‌క స‌న్నివేశాలు అభిమానుల్లో విస్త్ర‌తంగా చ‌ర్చ‌కు వ‌చ్చాయి.

ఆ క్ర‌మంలోనే ఆర్జీవీపై యువ‌హీరో నిఖిల్ విసిరిన పంచ్ కూడా అంతే వైర‌ల్ గా మారింది. ఆర్జీవీ పేరును ప్ర‌స్థావించ‌కుండానే కుక్క మొరిగితే శిఖ‌రం త‌ల తిప్పి చూడ‌దు! అంటూ ప‌వ‌న్ కి అండ‌గా నిలిచాడు ఈ యువ‌హీరో. ఇదిగో ఇంత‌కుముందు ప‌వ‌న్ క‌ల్యాణ్ షేర్ చేసిన ఫోటో చూస్తే ఆ సంగ‌తి ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

గ‌డ్డి తింటావా? అంటూ ప‌వ‌న్ హ్యాబిట్స్ పై సెటైరిక‌ల్ గా సాంగ్ రాయించారు ఆర్జీవీ. అయినా ప‌వ‌న్ త‌న స‌హ‌జ‌సిద్ధ‌మైన స్వ‌భావాన్ని వీడ‌లేదు. ప్ర‌కృతి జీవ‌నంతో మ‌మేక‌మై ఆవుల్ని త‌న తోట‌లో మేపుతూ షికారుకు తిప్పుతూ ఇలా గ‌డిపేస్తున్నారు. ముంబై ప‌న్వేల్ ఫామ్ హౌస్ లో వ‌రి నాట్లు వేస్తున్నాను అంటూ ఒంటి నిండా ఆర్టిఫిషియ‌ల్ గా బుర‌ద పులుముకుని ఫోటోషూట్ చేయించుకున్న భాయ్ స‌ల్మాన్ ఖాన్ లా ప‌వ‌న్ చేయ‌డం లేదు. అత‌డు త‌న‌కు ఇష్ట‌మైన వ్యాప‌కాల్ని ఎలాంటి భేష‌జానికి పోకుండా స్వ‌చ్ఛ‌మైన రైత‌న్న‌లాగా ఎంతో నిజాయితీగా ఇదిగో ఇలా లైవ్ లోనే చూపిస్తున్నారు. కుక్క‌లెన్ని మొరిగినా ఆయ‌న త‌ల తిప్పి చూసే ఛాన్సే లేద‌న‌డానికి ఈ ఒక్క ఫోటో చాల‌దూ? ``కుక్కా మొరిగితే కొండకి చెటా?`` అన్న‌ది త్రివిక్ర‌మ్ రాసిన లైన్. దానిని నిఖిల్ స‌మ‌ర్థంగానే ఉప‌యోగించాడు క‌దూ? మీరేమంటారు వ‌కీల్ సాబ్?