Begin typing your search above and press return to search.

జన సేనాని ఢిల్లీ పర్యటన అందుకోసమేనా..?

By:  Tupaki Desk   |   24 Nov 2020 6:00 PM IST
జన సేనాని ఢిల్లీ పర్యటన అందుకోసమేనా..?
X
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ నుంచి ఉపసంహరించుకుని బీజేపీకి జనసేన పార్టీ మద్దతు తెలుపుతుందని పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో జరుగబోతోన్న తిరుపతి ఎంపీ బై ఎలక్షన్ లో తమకు మద్దతివ్వాలని జనసేన అధినేత బీజేపీ హైకమాండ్ ని అడిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ సడన్ గా ఢిల్లీకి వెళ్ళింది సినిమా షూటింగ్ కోసం అని కూడా ప్రచారం జరుగుతోంది.

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వకీల్ సాబ్' సినిమాలో పవన్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మెజారిటీతో భాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఇందులో భాగంగా సుప్రీం కోర్టు ముందు కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉందట. దీని కోసమే పవన్ ఢిల్లీ వెళ్లారని సినీ వర్గాలు అంటున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ వెంట జనసేన పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ కూడా ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పర్యటనలో భాగంగా బీజేపీ పెద్దలను కలిసే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు. మరి జనసేనాని ఢిల్లీ వెళ్ళింది రాజకీయాల కోసమా లేదా సినిమా షూటింగ్ కోసమే అనేది తెలియాల్సి ఉంది.