Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ ప్లాన్ అదేనా...?

By:  Tupaki Desk   |   30 Sept 2020 8:30 PM IST
పవన్ కళ్యాణ్ ప్లాన్ అదేనా...?
X
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2019 ప్రత్యక్ష ఎన్నికలలో పాల్గొని పూర్తి సమయం ప్రజా సేవకే అని ప్రకటించి సినిమాలకు దూరం అయ్యాడు. అయితే ఇప్పుడప్పుడే ఎన్నికలు లేకపోవడం.. అందులోనూ పార్టీ కార్యకలాపాల కోసం ఆర్థికంగా నిలదొక్కుకోవడం అవసరమని భావించిన పవన్.. రెండేళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాడు. సినిమాల్లోకి రీ ఎంట్రీ అని చెప్పడమే తరువాయి.. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్‌ లను ఓకే చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. సినిమాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంలో పవర్ స్టార్ కెరీర్లోనే అత్యధిక హార్స్ పవర్‌ తో దూసుకుపోతున్నాడు. ముందుగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'వకీల్ సాబ్' సినిమాలో నటిస్తున్నాడు. దీంతో పాటు జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో ఓ పీరియాడికల్ మూవీ కమిట్ అయ్యాడు. ఇదే క్రమంలో మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో ఓ సినిమా.. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ మూవీ చేయడానికి అంగీకరించాడు. ఇప్పుడు లేటెస్టుగా బండ్ల గణేష్ ప్రొడక్షన్ లో కూడా ఓ సినిమా కమిట్ అయిన ప్రకటించారు.

అయితే పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లో నటిస్తున్నాడు అనగానే అందరూ 2024 ఎన్నికల లోపు ఎన్ని మూవీస్ చేయగలిగితే అన్ని చేయాలని నిర్ణయించుకున్నాడని.. తర్వాత మళ్ళీ రాజకీయాల్లో బిజీ అయిపోతారని అందరూ భావించారు. ఈ క్రమంలో వరుసగా సినిమాలు చేయడానికి పవన్ కళ్యాణ్ ప్లాన్ చేసుకున్నాడని కామెంట్స్ వచ్చాయి. పవన్ లైనప్ చూస్తుంటే ఇవన్నీ పూర్తవడానికి చాలా సమయం పడుతుంది. దీనిని బట్టి చూస్తే పవన్ ఎల‌క్ష‌న్స్ టైమ్ లో యాక్టీవ్ గా ఉండి.. వచ్చే ఎన్నికల ఫలితాలు ఆశాజనకంగా ఉన్నా లేకపోయినా సినిమాలు కంటిన్యూ చేయాలని డిసైడ్ అయ్యారని ఫిలిం సర్కిల్స్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే పవన్ వరుస ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ ఫ్యాన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పటికీ.. కొందరు జనసైనికులు మాత్రం అధినేతను పార్ట్ టైం పొలిటిషియన్ అంటూ ఇతర పార్టీ పక్షాలు గోల చేస్తారేమో అని ఆలోచిస్తున్నారట. ఏదేమైనా పవన్ కళ్యాణ్ సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా సక్సెస్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.