Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ కుమార్తె చ‌ర‌ణ్ ని డైరెక్ట్ చేస్తుంద‌ట‌!

By:  Tupaki Desk   |   27 Oct 2019 8:10 AM GMT
ప‌వ‌న్ కుమార్తె చ‌ర‌ణ్ ని డైరెక్ట్ చేస్తుంద‌ట‌!
X
మెగా బ్రద‌ర్స్ చిరంజీవి- ప‌వ‌న్ - నాగ‌బాబు మ‌ధ్య అనుబంధం గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. కుటుంబంలో ఐక్య‌త ఇటీవ‌ల హాట్ టాపిక్. ముఖ్యంగా ప‌వ‌న్ రెగ్యుల‌ర్ గా అన్న‌య్య చిరంజీవిని క‌లుస్తున్నారు. ఇక మెగా అభిమాన సంఘాల వ్య‌వ‌హారాల‌న్నీ చ‌క్క‌బెట్టే నాగ‌బాబు నిరంత‌రం అన్న‌య్య‌కు వెన్నంటి నిలుస్తారు.

కేవ‌లం అన్న‌ద‌మ్ములు మాత్ర‌మే కాదు.. వారి పిల్ల‌ల మ‌ధ్య అంతే ర్యాపో ఉంది. మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లి క‌జిన్స్ అంతా పెద‌నాన్న‌తో చ‌నువుగా ఉంటార‌ట‌. అలాగే కిడ్స్ చిరు- చ‌ర‌ణ్ తోనూ సాన్నిహిత్యం కొన‌సాగిస్తూ ఉంటార‌ట‌. ప‌వ‌న్ వార‌సులు చ‌ర‌ణ్ అంకుల్ తో చాలా స‌న్నిహితంగా ఉంటార‌ట‌. మెగాస్టార్ వార‌సులు శ్రీ‌జ‌- సుస్మిత‌ల డాట‌ర్స్ కానీ.. నాగ‌బాబు కూతురు నిహారిక కానీ.. ప‌వ‌న్ కుమార్తె ఆద్య కానీ వీళ్లంతా మెగాస్టార్ - రామ్ చ‌ర‌ణ్ ఇళ్ల‌కు వ‌చ్చి వెళుతుంటారు. అలా వ‌చ్చిన‌ప్పుడు వీళ్ల‌కు ఓ ఆచారం ఉంద‌ట‌.

త‌మ‌కు తోచిన .. తాము చేయాల‌నుకుంటున్న ఓ ప‌నిని అక్క‌డ బ్లాక్ బోర్డ్ పై రాసి వెళుతుంటార‌ట‌. అలా ఓసారి ప‌వ‌న్ కుమార్తె ఆద్య ఆ బ్లాక్ బోర్డ్ పై చ‌ర‌ణ్‌ ను డైరెక్ట్ చేయాల‌నుందని రాసింద‌ట‌. అచ్చం డాడ్ లానే ద‌ర్శ‌క‌త్వం ఆలోచ‌న చేస్తోంది ఆ చిన్నారి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టించినా ద‌ర్శ‌కుడిగానూ ఆయ‌న‌లోని స్కిల్ గురించి ఎక్కువ‌గానే ముచ్చ‌ట సాగింది. అయితే తండ్రి మ‌న‌సులోని కోరిక‌ను కుమార్తె నెర‌వేరుస్తుందా? చ‌ర‌ణ్ ని డైరెక్ట్ చేయాల‌న్న ఆలోచ‌న ప‌వ‌న్ కి కూడా రాలేదే! అంటూ అభిమానులు స‌ర‌దా ప‌డుతున్నారు. ఆద్య కోరిక నెర‌వేరాల‌నే ఆకాంక్షిద్దాం.