Begin typing your search above and press return to search.

సినీ ప‌రిశ్ర‌మ‌కు ప‌వ‌న్ కొత్త ఉత్సాహం!

By:  Tupaki Desk   |   20 April 2018 2:51 PM GMT
సినీ ప‌రిశ్ర‌మ‌కు ప‌వ‌న్ కొత్త ఉత్సాహం!
X
కొద్దిరోజులుగా టాలీవుడ్‌పై వివిధ కోణాల్లో జ‌రుగుతున్న‌ రాజ‌కీయ ప్రేరేపిత దాడుల‌తో సినిమా పరిశ్ర‌మ వ‌ణికిపోతోంది. తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయాక దేన్ని ఎలా ఎదుర్కొంటే ఏం జ‌రుగుతుందో తెలియ‌క అయోమ‌యంలో ప‌డుతోంది. ఇందులో టాలీవుడ్ ను బాగా ఇరుకున పెట్టిన ఇష్యూ కాస్టింగ్ కౌచ్ ఆరోప‌ణ‌లు. శ్రీ‌రెడ్డి యూట్యూబులో మొద‌లుపెట్టిన ఈ వివాదం చినికిచినికి గాలి వాన గా మారి టాలీవుడ్ మీదుగా ఏకంగా ఏపీ రాజ‌కీయాల‌ను తాకింది. ప‌వ‌న్ పేరు వ‌చ్చేంత వ‌ర‌కు ఒక‌ర‌కంగా సాగిన ఈ ఇష్యూ అందులోకి ప‌వ‌న్ పేరు లాగాక మ‌రో మ‌లుపు తీసుకుంది. చాలా రోజుల నుంచి కామ్ గా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ టైం చూసి తిరగ‌బ‌డ్డాడు. రాత్రి నుంచి అనుక్ష‌ణం స‌సాక్ష్యాల‌తో అంద‌రి గుట్టు విప్పుతున్న ప‌వ‌న్ ప్ర‌త్య‌క్ష న్యాయ పోరాటానికి సిద్ధ‌మ‌య్యారు. తెలుగుదేశం అండ‌తో తెలుగు మీడియా దారిత‌ప్పి న‌డుస్తోందంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ దెప్పిపొడిచారు.
ఇదిలా ఉండ‌గా తాజాగా జ‌న‌సేన మీడియా హెడ్ హ‌రిప్ర‌సాద్ దీనిపై పార్టీ త‌ర‌ఫున‌ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమను పలుచన చేస్తూ... సినీ మహిళా క‌ళాకారుల గౌరవానికి భంగం కలిగిస్తూ ప‌రిశ్ర‌మ‌లోని కుటుంబాలను అభాసుపాలు చేసేలా మీడియాలో కథనాలు వస్తుంటే చట్టపరంగా ముందుకు పోకుండా ఏం చేస్తున్నారని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా), నిర్మాతల మండలి, దర్శకుల సంఘం, ఫిల్మ్ ఫెడరేషన్.. తదితర విభాగాల నాయకులని పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రశ్నించినట్లు అందులో ప్ర‌స్తావించారు.

ఇంకా ఆ లేఖ‌లో ఏముందంటే... తెలుగుదేశం పార్టీ.. తమ అనుకూలంగా మీడియాతో నిరాధార‌ కథనాలు ప్రసారం చేయిస్తోందని, కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెప్పారు. ఈ రోజు ఉదయం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో కొన్ని టీవీ ఛానళ్ల తీరుపై స్పందించాల్సిన అవ‌స‌రంపై చ‌ర్చించారు. ఇండ‌స్ట్రీ మహిళల‌ను అవ‌మాన ప‌రుస్తుంటే ఎందుకు చూస్తూ ఊరుకున్నార‌ని ప‌వ‌న్ నిల‌దీశార‌ట‌.
ఒక ఛానల్ లో (టీవీ5) ఓ ఎడిటర్ కొన్ని రోజుల ముందు సినిమా రంగంలో అటువంటి వారు లేరా? అని అస‌భ్య ప‌దాలు వాడినా ప‌ట్ట‌న‌ట్టు ఎందుకున్నార‌ని వాళ్ల‌ను ప‌వ‌న్ ప్ర‌శ్నాంచార‌ట‌. చట్టపరంగా పోరాడడానికి 24 క్రాఫ్ట్స్ ఒకే తాటిపైకి రావాలి... క‌ళాకారిణుల ఆత్మాభిమానాన్ని కాపాడాలి... అని ప‌వ‌న్ సూచించార‌ట‌.


చాంబ‌ర్‌లో ప‌వ‌న్ ఎవ‌రితో మాట్లాడారంటే...
పవన్ కల్యాణ్ చాంబ‌ర్‌కు రావ‌డం అరుదు. ఈరోజు హుటాహుటిన అక్కడకు రావడంతో సినీ పరిశ్రమ ఆశ్చ‌ర్యానికి లోనైంది. శివాజీ రాజా, హేమ, అనితా చౌదరి, ఏడిద శ్రీరామ్, యువ కథానాయకులు రాంచరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, కృష్ణుడు, దర్శకుల సంఘం తరఫున ఎన్.శంకర్, వినాయక్, మెహర్ రమేష్, శ్రీకాంత్ అడ్డాల, వీర శంకర్, మారుతి.. నిర్మాతల మండలి నుంచి సుధాకర్ రెడ్డి, దామోదర ప్రసాద్, అల్లు అరవింద్, సుప్రియ, కె.ఎస్.రామారావు, ఎన్.వి.ప్రసాద్, నాగ అశోక్ కుమార్, ఎస్.రాధాకృష్ణ , సూర్యదేవర నాగవంశీ, పీడీ ప్రసాద్, ముత్యాల రాందాస్, కుమార్ చౌదరి, రచయితలు పరుచూరి బ్రదర్స్, విశ్వ, ఫెడరేషన్ నుంచి కొమర వెంకటేశ్ తదితరులు అక్క‌డ‌న ప‌వ‌న్‌ను క‌లిసి మాట్లాడారు. అంద‌రితో మాట్లాడాక భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ‌గా విపులంగా చ‌ర్చించాల‌ని నిర్ణ‌యించారు. ఈ మేర‌కు సినీ పెద్ద‌ల‌తో పాటు క‌ళాకారులంద‌రినీ క‌లుపుకుని శ‌నివారం విస్తృత సమావేశం నిర్వహించాలని తెలుగు చిత్ర పరిశ్రమ నిర్ణయం తీసుకుంది.