Begin typing your search above and press return to search.
'వకీల్ సాబ్' షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్..!
By: Tupaki Desk | 29 Dec 2020 11:05 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీగా వస్తున్న 'వకీల్ సాబ్' కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా లేట్ అవుతూ వచ్చింది. హిందీ హిట్ మూవీ 'పింక్' కి రీమేక్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో పవన్ తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను పూర్తి చేశాడు. ఈ విషయాన్ని తాజాగా చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తో కలిసి పవన్ కల్యాణ్ దిగిన ఫొటోలను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ఒక ఫొటోలో పవన్ దర్శకుడు వేణు శ్రీరామ్ ని నవ్వుతూ హగ్ చేసుకుని కనిపిస్తున్నాడు. అలానే మరో ఫొటోలో టీమ్ మొత్తం కనిపిస్తోంది.
కాగా, 'వకీల్ సాబ్' చిత్రాన్ని బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ కలిసి నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు విశేష స్పందన తెచ్చుకున్నాయి. పవన్ కి జోడీగా శృతి హాసన్ నటించింది. ఈ చిత్రంలో నివేధా థామస్ - అంజలి - అనన్య - ప్రకాష్ రాజ్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు. 'వకీల్ సాబ్' చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కొత్త సంత్సరం సందర్భంగా జనవరి 1న ఈ సినిమా టీజర్ ను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.