Begin typing your search above and press return to search.
వీడియో: అటవీ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ బుల్లెట్ రైడ్..!
By: Tupaki Desk | 18 Dec 2021 7:34 AM ISTపవన్ కల్యాణ్ - రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ''భీమ్లానాయక్''. ప్రస్తుతం వికారాబాద్ అడవుల్లో చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. పవన్ - రానా దగ్గుబాటికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. షాట్ గ్యాప్ లో పవన్ అక్కడి సుందరమైన ఫారెస్ట్ ఏరియాలో బైక్ రైడ్ చేశారు.
సినిమా షూటింగులు రాజకీయాలతో నిరంతరం భారీ స్థాయిలో సెక్యూరిటీ మధ్య తిరిగే పవన్ కళ్యాణ్.. ఇప్పుడు చాలా రోజుల తర్వాత ప్రకృతిని ఆస్వాదిస్తూ స్వేచ్ఛగా బైక్ రైడింగ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చాయి. ఖాకీ యూనిఫాంలో పవన్ బుల్లెట్ నడుపుతున్న వీడియోలను అభిమానులు ఫ్యాన్స్ గ్రూప్ లో షేర్ చేస్తూ వైరల్ చేసేశారు.
ఇకపోతే పవన్ షూటింగ్ కోసం వికారాబాద్ అటవీ ప్రాంతానికి వచ్చారనే విషయం తెలుసుకున్న స్థానికులు.. ఆయన్ను చూసేందుకు భారీగా లొకేషన్ వద్దకు చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ కారు నుంచి బయటకు వచ్చి వారికి అభివాదం చేశారు. షూటింగ్ స్పాట్ కు పెద్ద సంఖ్యలో అభిమానులు రావడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.
కాగా, వికారాబాద్ షెడ్యూల్ తో ‘భీమ్లా నాయక్’ షూటింగ్ మొత్తం పూర్తి అవుతుందని తెలుస్తోంది. ఆపై పవన్ క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడానికి తన ఫ్యామిలీతో కలిసి రష్యాకు వెళ్లనున్నారని సమాచారం. జనవరిలో ఇండియాకు తిరిగి వచ్చి మూవీ ప్రమోషన్స్ ను మొదలు పెట్టనున్నారు.
''భీమ్లా నాయక్'' చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న సంగతి తెలిసిందే. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇందులో పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ గా.. రిటైర్డ్ హవల్దార్ గా రానా కనిపించనున్నారు. పవన్ కు జోడీగా నిత్యామేనన్.. రానాకు జంటగా సంయుక్త మేనన్ సందడి చేయనున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.