Begin typing your search above and press return to search.

పవన్‌ బర్త్‌ డే కు ముచ్చటగా మూడు కన్ఫర్మ్‌

By:  Tupaki Desk   |   24 Aug 2021 10:34 AM GMT
పవన్‌ బర్త్‌ డే కు ముచ్చటగా మూడు కన్ఫర్మ్‌
X
ప్రస్తుతం యూట్యూబ్‌ లో టాప్ ట్రెండ్డింగ్స్‌ అన్ని కూడా చిరంజీవి నటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయి. ఆచార్య మొదలుకుని గాడ్‌ ఫాదర్‌.. భోళా శంకర్ మరియు బాబీ దర్శకత్వంలో సినిమాలకు సంబంధించిన మోషన్ పోస్టర్ లు.. కాన్సెప్ట్‌ పోస్టర్‌ లు ఇంకా గ్లిమ్స్ ను చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా విడుదల చేశారు. రెండు రోజుల పాటు చిరంజీవి బర్త్‌ డే సెలబ్రేషన్స్ మరియు పోస్టర్స్ తో అభిమానులు సోషల్‌ మీడియాలో పండుగ చేసుకున్నారు. మరో రెండు వారాల్లో రాబోతున్న పవన్ కళ్యాణ్ బర్త్‌ డే ను కూడా అంతే హడావుడిగా అభిమానులు సోషల్‌ మీడియాలో చేసుకోవడం దాదాపుగా ఖాయం అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.

పవన్‌ ప్రస్తుతం భీమ్లా నాయక్‌ సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ముగింపు దశకు వచ్చిందనే వార్తలు వస్తున్నాయి. ఆ సినిమా నుండి మొదటి పాటను పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా విడుదల చేయబోతున్నారు అనే టాక్ వినిపిస్తుంది. అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక గత పుట్టిన రోజుకు హడావుడి చేసిన హరి హర వీరమల్లు సినిమా ఈ పుట్టిన రోజుకు ఏం సందడిని అభిమానుల ముందుకు తీసుకు వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా షూటింగ్‌ ను కరోనా.. ఇతరత్ర కారణాల వల్ల చాలా నెలలుగా వాయిదా వేస్తూ వస్తున్నారు.

పుట్టిన రోజు సందర్బంగా పవన్‌ కొత్త పోస్టర్‌ కాని మరో వీడియోను కాని క్రిష్ రెడీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక హరీష్‌ శంకర్‌ గత బర్త్‌ డే సందర్బంగా కాన్సెప్ట్‌ పోస్టర్ ను విడుదల చేశాడు. కనుక ఈ సారి అంతకు మించి అన్నట్లుగా అభిమానులు ఆశిస్తున్నారు. మరి హరీష్‌ శంకర్ అభిమానుల కోసం ఏదో ఒక సర్‌ ప్రైజ్ ను మాత్రం పక్కాగా ప్లాన్ చేస్తాడు. ఈ మూడు సినిమాలు పక్కాగా అప్‌ డేట్స్ తో రాబోతుండగా.. మరి కొన్ని సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు వస్తాయని కూడా అంటున్నారు. మొత్తానికి పవన్‌ కళ్యాణ్ పుట్టిన రోజున కూడా ఇండస్ట్రీలో సోషల్‌ మీడియాలో సందడి వాతావరణం నెలకొంటుందని అంతా నమ్మకంగా ఉన్నారు.