Begin typing your search above and press return to search.

పవనంటేనే పవరు.. ఆ పేరే ఒక హోరు

By:  Tupaki Desk   |   2 Sept 2015 11:10 AM IST
పవనంటేనే పవరు.. ఆ పేరే ఒక హోరు
X
తెలుగు సినిమాలో హీరో అంటే చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేస్తూ తన అభిమాన గణాన్ని అశేషంగా ఆకట్టుకోవాలి.. ఈ స్టేట్ మెంట్ ని ఫాలో అవుతూ టాలీవుడ్ లోకి ప్రవేశించిన పవర్ స్టార్ ఆ సరిహద్దులను చెరిపేసి ఒక శక్తిగా ఎదిగాడు. ఇప్పుడు ఆయన ఏం చేసినా సంచలనమే. కేవలం ఒక చిరునవ్వుతో మూడ్ ని మార్చగలడు.. తెరపై అలా నడిచొస్తూ రికార్డులను తిరగరాయగలడు. తన అభిమాన దర్శకుడు హరీష్ శంకర్ తెలిపినట్టు పవర్ స్టార్ పేరు విన్నా తన కట్ అవుట్ చూసినా కిందనుండి పైదాకా ఎనర్జీ పాస్ అవుతుంది.

ఆయన ట్రెండ్ ని ఫాలో అవ్వరు.. సెట్ చేస్తారు. నిజమే.. ఖుషి బ్యాగ్ లు, బాలు ఫ్యాంట్ లు, జానీ కర్చీఫ్ లు ఇలా ప్రతీదీ యువతవిరివిగా ఫాలో ఐపోతారు. అతని సినిమాలో పాటల పల్లవులు వేరొక సినిమాలకు టైటిళ్ళు.. అతని చరిష్మాని నితిన్ వంటి పెద్ద హీరోలు సైతం ఫుల్ గా వాడేస్కున్న సందర్భాలు ఎన్నో. పవర్ స్టార్ పై భక్తిగీతాలు, ఇతర హీరోల అతని కోసం ప్రిపేర్ స్పెషల్ సాంగ్ లు ఇలా అతని క్రేజ్ కి నిదర్శనాలు కోకొల్లలు.

తెరమీద కాకుండా తెరవెనుక కూడా పవర్ స్టార్ ఎందరికో హీరోనే. వ్యక్తిగతంగా అతనికి తెరమీద పాత్రను పండించడం కంటే పొలంలో పంటలను పండించడమే ఇష్టమంటాడు. పక్కవారి కష్టాన్ని తన కష్టంగా భావిస్తాడని ఎందరో ఇప్పటికే వేదికపై తెలియజేశారు. అంతేకాక జనసేన అధ్యక్షుడిగా ప్రజల కష్టాలను తన కష్టంగా భావిస్తూ దేశాభివృద్ధికి తన వంతు కృషి చేస్తూ రీల్ లైఫ్ లోనేకాక రియల్ లైఫ్ లో కూడా హీరోగా మారిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి తుపాకీ.కామ్ తరపున జన్మదిన శుభాకాంక్షలు.