Begin typing your search above and press return to search.

150వ సినిమా వెనుక పవన్‌ హస్తం?

By:  Tupaki Desk   |   23 May 2015 11:00 PM IST
150వ సినిమా వెనుక పవన్‌ హస్తం?
X
అన్నయ్య చిరంజీవి నటించే 150వ సినిమా ప్రస్తుతం హాట్‌ టాపిక్‌. చరణ్‌ ఇక అన్నిటికీ రంగం సిద్ధం అన్నాడు. పూరీ కథ రెడీ చేయించుకుని బ్యాంకాక్‌లో ఫైనల్‌ టచప్‌కి రెడీ అవుతున్నాడు. బండ్ల గణేష్‌ సైతం ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌కెళుతుందా? అన్న ఆసక్తితో ఉన్నానని అన్నాడు. ఇంతమంది ఇన్నిరకాలుగా ప్రోత్సాహం అందిస్తుంటే తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌ ఏం చేస్తున్నట్టు? అస్సలు ఈ విషయంపై పెదవి విప్పడేం? అని అంతా సందేహించారు.

అయితే అందుకు పవన్‌ నుంచి రెస్పాన్స్‌ వచ్చింది. అన్నయ్యకు స్వయంగా ఫోన్‌ చేసి, ఇలాకాదు అన్నయ్యా.. నేనే లేటు అనుకుంటే నువ్వింకా ఆలస్యం చేస్తున్నావ్‌. వెంటనే నువ్వు మొదలెట్టెయ్‌.. నేను కాస్త తీరిగ్గా ఆలోచించుకుని సెట్స్‌కెళుతున్నా.. అని చెవిలో ఏదో చెప్పాడని అనుకుంటున్నారంతా. ఓ వైపు మెగాస్టార్‌ నటించే ఆటోజానీ సెట్స్‌కెళ్లగానే మరోవైపు తన సినిమా కూడా స్వింగులోకి వచ్చేస్తుందని మాట్లాడాడని అంటున్నారంతా.

అయితే అన్నదమ్ములు ఏం మాట్లాడుకున్నారు? అన్నది మిగతావాళ్లకు చెప్పాల్సిన పనేం లేదు. అన్నయ్య వెంటే తమ్ముడు. అన్న ఏం చేసినా ముందుగా తననుంచే ప్రోత్సాహం. అయితే ప్రతిదానికి ప్రచారం కోరుకునే మనస్తత్వం పవన్‌ది కాదు. అందుకే బైటపడడం లేదని ఫ్యాన్స్‌ చెబుతున్నారు.