Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ ఎంట్రీ ఖ‌రారైందండోయ్‌!

By:  Tupaki Desk   |   25 July 2015 5:51 AM GMT
ప‌వ‌న్ ఎంట్రీ ఖ‌రారైందండోయ్‌!
X
`గ‌బ్బ‌ర్‌ సింగ్` సీక్వెల్ మొద‌లై చాలా కాల‌మైంది. ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్త‌యింది. మ‌హారాష్ట్ర లో తీసిన తొలి షెడ్యూల్‌ లోనే ప‌వ‌న్ సెట్స్‌ పైకి అడుగుపెడ‌తాడ‌ని అన్నారు. కానీ ఆయ‌న మాత్రం ఇప్ప‌టికీ గుబురు గెడ్డం తోనే క‌నిపిస్తున్నారు. అస‌లు ప‌వ‌న్ గెడ్డం ఎప్పుడు తీస్తాడు? సినిమాలో కూడా అలా గెడ్డంతో కూడిన స‌న్నివేశాలేమైనా ఉన్నాయా? ఇంత‌కీ ఆయ‌న సెట్స్‌ పైకి ఎంట్రీ ఇచ్చేది ఎప్పుడు? ఇలా అభిమానుల్లో ఎన్నో ప్ర‌శ్న‌లు. ఎట్ట‌కేల‌కు ఆ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం వ‌చ్చేసింది. ప‌వ‌న్ ఎంట్రీ ఖరారైంది. ఈ నెల 29 నుంచి రెండో షెడ్యూల్ మొద‌ల‌వుతోంది. ఈ షెడ్యూల్‌ లోనే ప‌వ‌న్ సెట్స్‌ పైకి అడుగుపెడుతున్నాడ‌ని చిత్ర ద‌ర్శ‌కుడు బాబీ ట్విట్ట‌ర్ ద్వారా వెల్లడించాడు. సినిమాలో ప‌వ‌న్ పోలీసుగా న‌టిస్తున్నాడు కాబ‌ట్టి ఆయ‌న త్వ‌ర‌లోనే గెడ్డం తీసేయ‌బోతున్నారు. మళ్లీ మునుప‌టి స్టైల్‌ లో ప‌వ‌న్‌ని చూడొచ్చ‌న్న‌మాట‌.

మొద‌ట్నుంచీ `గ‌బ్బ‌ర్‌ సింగ్ 2`గా ప్ర‌చారంలో ఉన్న సినిమాకి `స‌ర్దార్‌` అనే పేరును ఖ‌రారు చేసిన‌ట్టు స‌మాచారం. గ‌బ్బ‌ర్‌ సింగ్ అనే క్యారెక్ట‌ర్‌, పేరుపై పేటెంట్ హ‌క్కులు ఉండ‌టంతో ఆ టైటిల్‌ ని వాడితే ప‌రిహారం చెల్లించాల్సి ఉంటుంద‌ట‌. అది ఇష్టం లేని ప‌వ‌న్‌ క‌ల్యాణ్ సినిమా పేరును `స‌ర్దార్‌`గా పెట్టేద్దామ‌ని చెప్పాడ‌ట‌. ప‌వ‌న్ సొంత సంస్థ‌లో ఆయ‌న స్నేహితుడు శ‌ర‌త్ మ‌రార్ నిర్మిస్తున్న చిత్ర‌మిది. బ‌డ్జెట్ హ‌ద్దులు దాట‌కుండా ఉండేలా ప‌వ‌న్ చ‌ర్య‌లు తీసుకొంటున్నాడు. ప‌వ‌న్ సెట్స్‌ పైకి అడుగుపెట్టాక షూటింగ్ మ‌రింత వేగం పుంజుకొనే అవ‌కాశాలున్నాయి. ప‌వ‌న్ ఇటీవ‌ల కొత్త ప్రాజెక్టుల గురించి సీరియ‌స్‌ గా ఆలోచిస్తున్న‌ట్టు తెలుస్తోంది. త్రివిక్ర‌మ్‌ తో `కోబ‌లి` సినిమాని తీయాల‌నే ఆలోచ‌న‌ లో ప‌వ‌న్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. అందుకే గ‌బ్బ‌ర్‌ సింగ్ సీక్వెల్‌ ని వీలైనంత త్వ‌రగా పూర్తి చేయాల‌నేది ప‌వ‌న్ ఆలోచ‌న‌గా తెలుస్తోంది.