Begin typing your search above and press return to search.

కంచె వేయడానికి బాబాయ్‌ వస్తాడా?

By:  Tupaki Desk   |   10 Sept 2015 10:57 AM IST
కంచె వేయడానికి బాబాయ్‌ వస్తాడా?
X
ప్రస్తుతం ఇండస్ట్రీ కళ్లన్నీ నాగబాబు నటవారసుడు వరుణ్‌ తేజ్‌ పైనే. అతడు నటించిన రెండో సినిమా కంచె రిలీజవుతోంది. ఈ సినిమాతో వరుణ్‌ ఎలాంటి మార్క్‌ వేయబోతున్నాడో చూడాలన్న ఆత్రుత అందరిలోనూ ఉంది. క్రిష్‌ సంథింగ్‌ ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాడన్న భావన కంచె ట్రైలర్‌ చూశాక అందరిలోనూ కలిగింది. ఈ సినిమా యూనివర్శల్‌ కాన్సెప్టుతో తెరకెక్కిందని అర్థమవుతోంది.

అయితే ఈనెల 12న రిలీజ్‌ కావాల్సిన ఆడియో ఐదురోజులు ఆలస్యంగా అంటే ఈనెల 17న రిలీజవుతోంది. అసలు ఈ వాయిదాకి కారణమేంటి? అని అరాతీస్తే.. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ అని తెలిసింది. పవన్‌ ప్రస్తుతం వేరే పనులతో బిజీ. 12న కంచె ఆడియోకి రావడం కుదరదు. అందుకే అతడి కోసం 17కి వాయిదా వేశారు. బాబాయ్‌ కోసం అబ్బాయ్‌ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నాడు. నేచురల్‌ గా పవన్‌ ఆడియోలకు రాడు. కానీ అబ్బాయ్‌ కోసం ఈసారి తప్పక వస్తాడు అంటున్నారు.

మరో కోణంలో చూస్తే గోపాల గోపాల, సర్ధార్‌ గబ్బర్‌ సింగ్‌ చిత్రాల మాటల రచయిత బుర్రా సాయిమాధవ్‌ కంచె సినిమాకి కూడా మాటలు అందించారు. గోపాల గోపాల నుంచి సాయిమాధవ్‌ పవన్‌ అభిమాన రచయిత అయ్యాడు. ఈ స్నేహం కోసం అయినా పవన్‌ ఆడియోకి వస్తాడని భావిస్తున్నారంతా. పైగా అన్నయ్య 60వ పుట్టినరోజు వేడుకలకు విచ్చేసి నేను ఎవరికీ వ్యతిరేకిని కాను అని సస్పెన్స్‌ కి తెర తొలగించాడు కాబట్టి ఇక మెగా హీరోల కీలకమైన ఈవెంట్లకు అతడు హాజరవుతాడన్న సిగ్నల్‌ వచ్చింది. కంచె వేయడానికి పవన్‌ బాబాయ్‌ వస్తాడు. వచ్చి తీరతాడు. వరుణ్‌ కోసం.. సాయిమాధవ్‌ కోసం.. !