Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్: 'భవదీయుడు భగత్ సింగ్' గా పవన్ కళ్యాణ్..!

By:  Tupaki Desk   |   9 Sept 2021 10:27 AM IST
ఫస్ట్ లుక్: భవదీయుడు భగత్ సింగ్ గా పవన్ కళ్యాణ్..!
X
పవన్ కళ్యాణ్ - హరీశ్ శంకర్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ పవర్ ఫుల్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్ - ప్రీ లుక్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో టైటిల్ & ఫస్ట్ లుక్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ పవర్ ప్యాక్డ్ అప్డేట్ తో వచ్చారు. తాజాగా #PSPK28 టైటిల్ తో పాటుగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసారు.

పవన్ కళ్యాణ్ చిత్రానికి గత కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్న ''భవదీయుడు భగత్ సింగ్'' అనే పవర్ ఫుల్ టైటిల్ నే మేకర్స్ ఖరారు చేసారు. వీరి కలయికలో ఇంతకముందు వచ్చిన 'గబ్బర్ సింగ్' సౌండింగ్ తో 'భగత్ సింగ్' టైటిల్ అదిరిపోయిందని.. పవర్ ఫుల్ కటౌట్ కి ఇది పవర్ ఫుల్ టైటిల్ అని పీకే ఫ్యాన్స్ అంటున్నారు. ఫస్ట్ లుక్ విషయానికొస్తే.. ఇండియా గేట్ ముందు ఓ ట్రెండీ బైక్ మీద కూర్చొని పవన్ స్టైల్ గా టీ తాగుతూ కనిపిస్తున్నాడు. పవన్ లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందులో జనసేన పార్టీ సింబల్ 'గ్లాస్' ని కూడా చూపించడంతో ఖుషీ అవుతున్నారు.

''భవదీయుడు భగత్ సింగ్ - వెండితెరపై చెరగని సంతకం. ఈసారి ఇది కేవలం వినోదం మాత్రమే కాదు'' అని చిత్ర బృందం పేర్కొంది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత చిత్రాల టైటిల్స్ అన్నీ ఆసక్తికరంగా ఉంటున్నాయని చెప్పవచ్చు. 'వకీల్ సాబ్' 'భీమ్లా నాయక్' 'హరి హర వీరమల్లు' వంటి డిఫరెంట్ టైటిల్స్ కు తోడుగా ఇప్పుడు ''భవదీయుడు భగత్ సింగ్'' చేరింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. అయానంక బోస్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేయనున్నారు. ఫైట్ మాస్టర్ ద్వయం రామ్-లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రఫీ.. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. ‘భీమ్లా నాయక్’ ‘హరిహర వీరమల్లు’ సినిమాలతో పాటుగా #PSPK28 కోసం డేట్స్ కేటాయించాలని పవన్ చూస్తున్నారని సమాచారం.