Begin typing your search above and press return to search.

సంచ‌ల‌నంగా ప‌వ‌న్‌.. త్రివిక్ర‌మ్ ఓపెన్ ఆఫ‌ర్‌!

By:  Tupaki Desk   |   30 April 2017 6:47 AM GMT
సంచ‌ల‌నంగా ప‌వ‌న్‌.. త్రివిక్ర‌మ్ ఓపెన్ ఆఫ‌ర్‌!
X
క‌ళాత‌ప‌స్వి కె.విశ్వ‌నాథ్ లాంటి ద‌ర్శ‌కుడు మ‌ళ్లీ సినిమా తీస్తే..? మ‌ంచి తెలుగు సినిమా రావాల‌ని కోరుకునే ప్రేక్ష‌కుల కోరిక‌. కానీ.. క‌మ‌ర్షియ‌ల్ హిట్ కాద‌నో.. వ‌సూళ్ల‌కు ఇబ్బంది ఎదుర‌వుతుందోన‌న్న కార‌ణంగా విశ్వ‌నాథ్‌ తో సినిమాలు తీయ‌టం లేద‌న్న‌ది నికార్సైన నిజం. అయితే.. ఆయ‌న‌తో సినిమా తీయ‌టానికి సిద్ధ‌మ‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ అండ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ లు. తాజాగా ఇచ్చిన ఒక ఇంట‌ర్వ్యూలో మాట‌ల మ‌ధ్య‌లో వ‌చ్చిన సంభాష‌ణ‌కు అనూహ్యంగా స్పందించిన త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌.. కె.విశ్వ‌నాథ్‌ కు ఓపెన్ ఆఫ‌ర్ ఇచ్చేయ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

దాదాఫాల్కే అవార్డును కె.విశ్వ‌నాథ్‌ కు ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ఆయ‌న్ను అభినందించేందుకు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్.. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌ లు ఇద్ద‌రూ వెళ్ల‌టం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో.. వీరిద్ద‌రూ క‌లిసి ఒక మీడియా సంస్థ‌కు ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఇందులో.. ఇంట‌ర్వ్యూ చేసే వ్య‌క్తి.. తాజాగా త్రివిక్ర‌మ్.. ప‌వ‌న్ చేస్తున్న‌చిత్రంలో విశ్వ‌నాథ్‌ కు ఏదైనా పాత్ర ఉందా? అని అడిగారు. దీనికి బదులిచ్చిన త్రివిక్ర‌మ్ ఊహించ‌ని రీతిలో స‌మాధానం ఇచ్చారు.

త‌గిన పాత్ర ఉండాలే కానీ.. ఆయ‌న మా సినిమాలో న‌టించ‌టం అంటే మా అదృష్ట‌మ‌ని.. విశ్వ‌నాథ్ లాంటి ద‌ర్శ‌కుడు త‌న ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తే బాగుంటుంద‌న్న‌ది త‌మ అభిప్రాయంగా త్రివిక్ర‌మ్ చెప్పారు. దీనికి ప‌వ‌న్ కూడా ఏకీభ‌వించ‌టం.. అందుకు మ‌ళ్లీ స్పందించిన త్రివిక్ర‌మ్‌.. విశ్వ‌నాథ్ గారు కానీ సిద్ధ‌మంటే ఆయ‌న తీసే సినిమాను తామే ప్రొడ్యూస్ చేస్తామ‌ని.. ప‌వ‌న్ క‌ల్యాణ్ క్రియేటివ్ వ‌ర్క్స్ లో తామే తీస్తామ‌ని.. ఇది ఓపెన్ ఆఫ‌ర్ గా చెప్పారు. విశ్వ‌నాథ్ గారు స‌రేనంటే.. రేపే నేను.. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇద్ద‌రం వెళ్లి ఆయ‌న‌తో కూర్చొని మాట్లాడ‌తాం. మ‌ళ్లీ ఆయ‌న నుంచి మ‌రో ఆణిముత్యం వ‌స్తుంది.. దాన్ని నిర్మించామ‌న్న సంతృప్తి మాకు మిగులుతుందంటూ వ్యాఖ్యానించారు. మ‌రి.. త్రివిక్ర‌మ్‌.. ప‌వ‌న్ ల ఓపెన్ ఆఫ‌ర్ కు విశ్వ‌నాథ్ ఎలా రియాక్ట్ అవుతారో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/