Begin typing your search above and press return to search.
పవన్-త్రివిక్రమ్.. నెల రోజులు అక్కడే
By: Tupaki Desk | 20 July 2017 10:07 AM ISTపవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ షూటింగ్ స్పీడ్ గానే జరుగుతోంది కానీ.. ఆశించిన స్థాయి వేగం లేదు. ఇప్పటికే సంక్రాంతికి రిలీజ్ వాయిదా వేసుకోవడంతో.. చాలా జాగ్రత్తగా సీన్స్ ను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు త్రివిక్రమ్. ఇప్పుడీ మూవీ యూనిట్ బల్గేరియాకి బయల్దేరి వెళ్లింది.
హైద్రాబాద్ లో కీలకమైన షెడ్యూల్స్ పూర్తి చేసిన తర్వాత.. ఇప్పుడు బల్గేరియాలో సుదీర్ఘమైన షూటింగ్ చేయనున్నారట. దాదాపు నెలరోజులకు పైగా ఈ యూరోప్ కంట్రీలో షూట్ చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. కీలకమైన సన్నివేశాలతో పాటు.. కొన్ని పాటల చిత్రీకరణ కూడా ఈ షెడ్యూల్ లోనే కంప్లీట్ చేస్తారట. పవర్ స్టార్ తో పాటు అనేకమంది కీలక నటులు ఈ బల్గేరియా షెడ్యూల్ లో భాగం అయినట్లు చెబుతున్నారు. బల్గేరియాలో షూట్ పూర్తయిన తర్వాత తిరిగి హైద్రాబాద్ వచ్చి షూటింగ్ కొనసాగిస్తారని తెలుస్తోంది. నిజానికి కేవలం సాంగ్స్ కోసం మాత్రమే బల్గేరియా అనుకుంటే.. ఏకంగా సీన్లు కూడా అక్కడే తీయడం అనేదే కాస్త ఆశ్చర్యకరమే.
పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన మూవీ అత్తారింటికి దారేది చిత్రంలో లో కూడా యూరోప్ లో ప్రధాన సన్నివేశాలు ఉంటాయి. కాకపోతే ఆ సినిమాలో స్పెయిన్ ను బేస్ చేసుకుని మూవీ స్టోరీ ప్రారంభమవుతుంది. ఈ సారి బల్గేరియాపై ఫోకస్ పెట్టాడు త్రివిక్రమ్. కేవలం పాటల కోసమే కాకుండా.. స్టోరీని కూడా ఆయా దేశాలకు లింక్ చేస్తూ.. విజువల్స్ బాగా అట్రాక్టివ్ గా ఉండేలా ప్లాన్ చేసుకోవడంలో ఈ దర్శకుడు దిట్ట.