Begin typing your search above and press return to search.
బతుకమ్మకు పవన్ రెఢీనట
By: Tupaki Desk | 28 March 2017 10:08 AM ISTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యవహారం కాస్త డిపరెంట్. ఆ మాటకు వస్తే.. గడిచిన కొంతకాలంగా టాలీవుడ్ ప్రముఖ హీరోలంతా సినిమా తర్వాత సినిమా తీయటం.. అది కూడా ఏడాదికి ఆచితూచి ఒక్క సినిమా తీయటం లాంటివి కనిపిస్తాయి. ఇండస్ట్రీ బాగు గురించి గంటల కొద్దీ లెక్చర్లు ఇచ్చేవారు.. ఏడాదికి ఒకటో.. మరీ తప్పదనుకుంటే రెండు సినిమాలు చేయటం.. దాన్నో ప్రసాదంలా అభిమానులు ఫీలై పండగ చేసుకోవటం కనిపిస్తుంది.
ఇలాంటి వ్యవహారాల్లో పవన్ తీరు మరింతగా ఉంటుంది. ఏడాదికి ఒక్కటి చొప్పున ఆయన సినిమా చేసిన ఫ్యాన్స్ దీపావళి.. దసరా కలిపి చేసేసుకుంటారు.కానీ..ఆయన సినిమాకు సినిమాకు మధ్య గ్యాప్ కనీసం ఏడాదిన్నర దాటిన సందర్భాలు ఉంటాయి. ఎందుకిలా అంటే.. సినిమా పూర్తి అయి.. విడుదల తర్వాత.. కనీసం ఒకట్రెండు నెలలు రెస్ట్.. వగైరా..వగైరాలు ఉండటమే.
2019 ఎన్నికలకు దాదాపు ఆర్నెల్ల ముందు నాటికి రాజకీయాల్లోకి సీరియస్ గా దృష్టి పెట్టాలని భావిస్తున్న పవన్ కల్యాణ్..అందుకు తగ్గట్లు సిద్ధమయ్యేందుకు చకచకా సినిమాలు తీయాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. దీంతో.. రోటీన్ కు భిన్నంగా తన సినిమా విడుదల తర్వాత తీసుకునే గ్యాప్ ను పక్కన పెట్టేసి.. షూటింగ్ కి సిద్ధమైపోతున్నారు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయాల్సిన మూవీ షూటింగ్ కు డేట్ ఫిక్స్ చేయటమే కాదు.. రిలీజ్ ఎప్పుడన్నది కూడా డిసైడ్ అయినట్లుగా తెలుస్తుంది. ఏప్రిల్ ఆరు నుంచి మొదలయ్యే ఈ చిత్ర షూటింగ్.. నాన్ స్టాప్ గా నాలుగు నెలల పాటు వర్క్ చేసేసి.. బతుకమ్మ పండగ నాటికి థియేటర్లలోకి బొమ్మ వేసేద్దామని అనుకుంటున్నట్లు చెబుతున్నారు.
ఒకవేళ అదేనిజమైతే.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు అంతకు మించిన ఆనందం ఇంకేం ఉంటుంది. ఒకే ఏడాదిలో తమ అభిమాన హీరో సినిమాలు రెండు చూసే అవకాశం కలగటం వారిని పిచ్చ హ్యాపీకి గురి చేస్తుందనటంలో సందేహం లేదు. వెంటవెంటనే అగ్రహీరోల సినిమాలు స్టార్ట్ అవుతుంటే.. ఇండస్ట్రీ సైతం కళకళలాడటం ఖాయం. కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటించే ఈ చిత్రంలో.. పవన్ ఐటీ ఇంజనీర్ గా నటించనుండటం గమనార్హం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/