Begin typing your search above and press return to search.

వాళ్లకు యాభై కోట్లు.. వీళ్లకు యాభై లక్షలా?

By:  Tupaki Desk   |   7 April 2017 6:00 AM IST
వాళ్లకు యాభై కోట్లు.. వీళ్లకు యాభై లక్షలా?
X
తెలుగులో ఒక స్టార్ డైరెక్టర్.. ఒక స్టార్ హీరో జట్టు కడితే చాలు బడ్జెట్ కొండెక్కి కూర్చుంటోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్.. మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు.. స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తే బడ్జెట్ మినిమం వంద కోట్లు ఉంటోంది. పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్లో ఈ మధ్యే మొదలైన సినిమా బడ్జెట్ అక్షరాలా వంద కోట్లు. మరీ అంత ఖర్చు పెట్టి ఏం సినిమా తీసేస్తారు అన్న సందేహాలు కలగొచ్చు. ఐతే ఇందులో సినిమాకు ఖర్చు పెట్టేది సగం కూడా ఉండదు. సగానికి సగం కేవలం హీరో-డైరెక్టర్ పారితోషకాలకే అయిపోతుంది. ‘సర్దార్ గబ్బర్ సింగ్’.. ‘కాటమరాయుడు’ సినిమాలకు పవన్ రూ.25 కోట్ల చొప్పున పారితోషకం తీసుకున్నట్లు అంచనా.

ఐతే త్రివిక్రమ్ సినిమాకు అంతకంటే మిన్నగా రూ.30 కోట్ల దాకా పుచ్చుకుంటున్నట్లు చెబుతున్నారు. త్రివిక్రమ్ కూడా రికార్డు స్థాయిలో ఈ సినిమాకు రూ.15-20 కోట్లు రెమ్యూనరేషన్ కింద పుచ్చుకుంటున్నట్లు సమాచారం. ఐతే వీళ్లిద్దరూ ఇంతింత అందుకుంటూ హీరోయిన్లకు మాత్రం గీచి గీచి పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు కీర్తి సురేష్.. అను ఇమ్మాన్యుయెల్ లను హీరోయిన్లు ఎంచుకున్న సంగతి తెలిసిందే. వాళ్లిద్దరూ తెలుగు ఇంతకుముందు చేసినవి చిన్న సినిమాలు. ఒక్కసారిగా పవన్-త్రివిక్రమ్ సినిమాలో ఛాన్స్ అనగానే చాలా ఎగ్జైట్ అయిపోయారట. ఈ ఎగ్జైట్మెంట్లో రెమ్యూనరేషన్ గురించి పెద్దగా పట్టించుకోలేదట. కీర్తి తమిళంలో మంచి డిమాండింగ్ పొజిషన్లో ఉన్నప్పటికీ పవన్ సినిమాకు మాత్రం రూ.50 లక్షల పారితోషకానికే ఒప్పుకుందట. అను ఇమ్మాన్యుయెల్ అంత కంటే కొంచెం తక్కువే పుచ్చుకుంటోందట. హీరో.. డైరెక్టర్ కలిపి రూ.50 కోట్లు అందుకుంటూ.. హీరోయిన్లకు మాత్రం చెరో 50 లక్షలకు పరిమితం చేస్తుండటం ఆశ్చర్యమే కదా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/