Begin typing your search above and press return to search.

పవన్.. ఆ వేడుక అప్పుడేనా?

By:  Tupaki Desk   |   10 Nov 2017 5:29 PM IST
పవన్.. ఆ వేడుక అప్పుడేనా?
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఎలా ఉంటుందనే విషయం తర్వాత సంగతి. ఫస్ట్ ఆయన థియేటర్స్ లో అడుగుపెడితే ఆ కిక్కే వేరబ్బా.. అని ప్రతి పవన్ అభిమాని అనుకుంటాడు. ఆయన సినిమా గురించి చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో ఆ రోజంతా ఆ విషయం గురించే చర్చలు జరుగుతుంటాయి. తెలుగులో పవన్ సినిమా రిలీజ్ అయితే తమిళ్ సినిమా వాళ్లు కూడా చేసుకొని సెలబ్రేషన్స్ ఇక్కడ అయన అభిమానులు చేసుకుంటారు.

ముఖ్యంగా పవన్ ఇప్పుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా తీస్తుండడంతో ఆ అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. జస్ట్ అజ్ఞాతవాసి అనే టైటిల్ గురించి ఆలోచిస్తుండగానే అందరు అదే టైటిల్ అని ఫిక్స్ అయ్యారు. కానీ ఇంకా చిత్ర యూనిట్ నుంచి మాత్రం అధికారికంగా ఏ న్యూస్ వెలువడలేదు. ప్రస్తుతం అభిమానులకు మాత్రం ఆ టైటిల్ బాగా నచ్చేసింది. ఇక ఆడియో రిలీజ్ ను కూడా త్వరలోనే రిలీజ్ చెయ్యాలని త్రివిక్రమ్ అనుకుంటున్నాడట.

ఇప్పటికే 'బైటికొచ్చి చూస్తే' అనే సాంగ్ త్రివిక్రమ్ బర్త్ డే సందర్బంగా రిలీజ్ చేశారు. సాంగ్ సూపర్బ్ గా ఉండటంతో అందరికి నచ్చేసింది. ఇక అలాగే మరో రెండు పాటలను రిలీజ్ చేసి ఫైనల్ గా డిసెంబర్ 14న గ్రాండ్ గా ఆడియో వేడుకను జరపాలని చూస్తున్నారట. ఇక నెక్స్ట్ ఇయర్ జనవరి 10న సినిమాని రిలీజ్ చేస్తారట. అనిరుద్ మొత్తంగా అయిదు పాటలను కంపోజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బల్గెరియాలో చిత్ర యూనిట్ షూటింగ్ పనుల్లో చాలా బిజీగా ఉంది. అను ఇమ్మాన్యుయేల్ - కీర్తి సురేష్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను రాధాకృష్ణ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.